ఈ భూమి మీదకు వచ్చిన వ్యక్తులలో ప్రతి ఒక్కరూ వారి జీవితాలు హాయిగా ప్రశాంతంగా జరగడానికి ముందు ధనాన్ని సంపాదించాలి తన కుటుంబానికి తనకు పోషణ జరగడానికి అనువుగా ధనార్జన లేకపోతే బ్రతకడం కష్టం కనుక ఉద్యోగం చేసి అయినా వ్యాపారం చేసి అయినా ధనాన్ని సంపాదించి తీరాలి తన కుటుంబ అవసరాలకు సరిపడినంత మాత్రాన సరిపోదు ధర్మ మార్గంలో నీవు ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించి నీ అవసరాలను అన్నిటిని తీర్చుకొని నీ ప్రక్కవారు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు కరుణతో వాడికి కనీసం పొట్ట నింపుకొనే సరుకులను ఇవ్వడం నీ కనీస ధర్మంగా భావించి ఆ మార్గంలో పయనిస్తే మంచివాడు అన్న పేరు మనకు వస్తుంది. మనకు మనసులో ఇతరులకు సహాయం చేయాలన్న అభిప్రాయం ఉంటుంది అయితే ఎవరికి చేయాలి ఎలా చేయాలి? ఏ సందర్భాలలో చేయడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి జీవితంలో బాగా బ్రతికి కారణాంతరాల వల్ల తన ఆస్తిపాస్తులు అన్నిటిని పోగొట్టుకొని ఏకాంతంగా ఉన్న వ్యక్తి నీకు తెలిసిన వాడైతే అతనికి తప్పకుండా సహాయం చేసి తీరవలసినదే ఇది ఏదో పుణ్యకార్యానికి చేస్తున్నట్లుగా కానీ తన ఆస్తి ఎప్పుడైనా పొరపాటుగా పోతే అతను ఏదైనా సహాయం చేస్తాడు అన్న ఆలోచనతోగాని ఇలాంటి పని చేయకూడదు అని మన పెద్దలు చెబుతారు దానివల్ల నీవు చేసిన సహాయానికి ఫలితం ఉండదు అంటారు. పెద్దల మాట శిరసా వహించడం మన ధర్మం. పెద్ద పెద్ద సహాయాలు చేయకపోవచ్చు ఒక దేవాలయం కట్టాలి లేదా విద్యాలయం కోసం చందా ఇవ్వమని కోరితే నీవు అనుకున్నంత ఇవ్వలేకపోవచ్చు. ఎంత ఇవ్వగలవో అంత ఇస్తే వేడి నీళ్ళకు చన్నిళ్ళల వాళ్లకు సహకారంగా ఉంటుంది అలా ప్రతి వారు చేసినట్లయితే ఆ మంచి కార్యం ఫలప్రధమవుతుంది అందుకే విష్ణుశర్మ గారు పంచతంత్రంలో ఒక మాట చెప్పారు జరా మరణములు లేక విద్యా ధనముల గడియించవలె అని కొన్ని కార్యక్రమాలకు ధనం ఎంత అవసరమో కొంతమంది వ్యక్తులకు చదువు కూడా అంతే అవసరం కనుక నీవు సంపాదించిన విద్వత్తును వారికి పంచినట్లయితే నీ ఆలోచనలకు నీ ఆశయాలకు అతను కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తాడు బాగా ఆలోచించండి.
ఎవరికి ధనం...?;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి