తెలుగు చలన చిత్రసీమలో ప్రేక్షకులకు గుర్తులేకుండా పోయిన నట,నటీమణులు ఎందరో ఉదాహరణకు హస్యనటి మీనాకుమారి,సురభి బాలసరస్వతి, ఇలా ఎందరో.....
చిత్ర పరిశ్రమ ఎవరిని ఆదరిస్తుందో ఊహించలేము.కొందరు స్వయంకృతాపరాధంతో తమజీవితాలకు దుర్బరమైన ముగింపు పలుకుతారు.
లక్షలమంది అభిమానులు,అడుగులకు మడుగులువత్తే దాసీజనాలు, రాజభవనాలువంటి బంగళాలు,పడవ వంటి గొప్పకార్లు,ఇంటి నిండా జనాలు, ఏడువారాల నగలు,ధరించిన నటీమణులు తమ చివరి దశలో అనాధఆశ్రమాలలో మరణించడం చూసే మనకు మనసు భారం అవుతుంది.ఏలూరు నుండి చిత్రపరిశ్రమకు వచ్చిన సినీతార లక్ష్మికాంత. తనసోదరుడి సోదరితో సహాచేసి ప్రముఖనాట్యకళాకారుడు ఉదయశంకర్ డాన్స్ ట్రూపుతో ఎన్నోనృత్యప్రదర్శనలు ,జెమినివారి ' చంద్రలేఖలో 'గ్రూప్ డాన్స్ చేస్తూ ఈమె తొలిసారి వెండితెరపై కనిపించింది. అనంతరం తన నాట్యగురువు ఉదయశంకర్ సొంత చిత్రం ' కల్పన ' చిత్రం లోనృత్యం చేసారు. ' మనదేశం ' లో హాస్యపాత్రలో వంగర,రేలంగి గార్లతో నటించారు . అనంతరం విజయావారి ' పాతాళభైరవి ' (1951)చిత్రంలో వగలోయ్ వగలు,అనేపాటతో మంచి నర్తకిగా పేరుపొందారు. ' మరదలుపెళ్ళి ' (1952) చిత్రంలో పిలిచే గోదావరిరొడ్డు,పాటతో మంచిగుర్తింపు వచ్చింది.నృత్యదర్మకులు పసుమర్తికృష్ణమూర్తిగారు నాట్యంలో పలు మెలకువలు ఈమెకు నేర్పించారు.
' పేరంటాలు ' (1951) చిత్రంలో సహాయనటిగా, ' పాలేరు ' ' అగ్నిపరిక్ష ' ' ప్రపంచం ' చిత్రాలలో వ్యాంపుగా,' మాయలమారి ' చిత్రంలో నాట్యగత్తేగా ' పల్లెటూరి పిల్ల' వంటిచిత్రాలలో మంచిపాత్రలే వచ్చాయి.అనంతరం
' ప్రియురాలు ' చిత్రంలో కథానాయకిగా అవకాశం వచ్చింది. (కథానాయకుడిగా జగ్గయ్యగారికి ఇదితొలి చిత్రం) మద్రాసు తేనాంపేటలో పెద్దసొంత బంగళా పెద్దకారులో సొంతంగా నడుపుతూ స్టూడియోలకు వచ్చెది,పేరుపొందిన క్లబ్ లో మెంబర్ గా బ్యాడ్ మెంటన్ ,బ్రిలియడ్స్ ఆడటంలో మంచిపేరు.చెల్లెలు పెళ్ళి చాలాఘనంగా చేసింది. కథానాయికగా నటించి చిన్నవేషాలు తిరస్కరించడంతో ఆర్ధిక సమస్యలు ఆరంభంఅయ్యాయి.ఆస్తులు కరిగిపోవడం,తనఅనుకున్నవాళ్ళు అందరూ దూరంఅయ్యరు.మొదటి నుండి తనఊరివాడు నాటి సహనటుడు చంద్రశేఖర్ తొ కలసి నివసించేది.తన సహచరుడు తనకువేషం ఇస్తేనే లక్ష్మికాంత నటిస్తుంది అనడంతో వేషాలు పూర్తిగా తగ్గిపోయాయి.యిల్లు తమళ నటుడు ఎం.ఆర్ ,రాధ గారికి అమ్మివేసింది,కారు అప్పులవాళ్ళుపట్టుకు పోయారు.సొంతనాటకం ట్రూపు ఏర్పాటుచేసుకున్నా రాణించలేకపొయారు. సహచరుడు చంద్రశేఖర్ ఆమెను వదలి వెళ్ళిపోయాడు. రక్తకన్నిరు నాటకంలో వేశ్యపాత్రలోనటిస్తూ కొంతకాలం గడిపారు.చిన్నఅద్దెయింటిలోఉంటూ ఇడ్లీలు అమ్ముకుంటూ బ్రతుకుతున్న సమయంలో నటుడు జగ్గయ్య 500 నెలకు పెన్షన్ ఏర్పాటుచేసారు. ఎం.జి.ఆర్.తమ్ముడు చక్రపాణి తనకో ప్రభుత్వపధకంలో ఇల్లు యిప్పించినా నిలుపుకోలేకపోయారు. చివరిలో బట్టలు కుడుతూ టైలర్ గా జీవితంగడుపుతూ,వయోభారంతో పాండిచ్చేరి లోని క్త్రెస్తవ శరణాలయంలో ఉంటూ ఈమె 2014లో కన్నుమూసారు .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి