సిరిపురం అనే ఊరిలో పాపయ్య అనే ధనవంతుడు ఉండేవాడు.అతడు చాలా పిసినారి.డబ్బు మీద ఆశతో అతను ఎప్పుడు బాగా డబ్బు సంపాదించాలని చూసేవాడు.కానీ ఆ డబ్బుతో ఎలాంటి సుఖాలు అనుభవించేవాడు కాదు. సంతానం లేదు.అతని పిసినారితనాన్ని భరించలేక భార్య పుట్టింటికి వెళుతుంది.తోబుట్టువులు దూరమవుతారు.ఊరిలో ఎవరు అతనితో మాట్లాడారు.
అయినా పాపయ్యలో ఎలాంటి మార్పు రాలేదు.తాతల కాలం నాడు కట్టించిన ఇంటిలో నివసించేవాడు.
ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి ఆ భవనం కురుస్తుంది.అలా వాన కురుస్తున్న ఇంటిలోనే ఉంటాడు,కానీ ఆ ఇంటికి మరమ్మత్తులు చేపించడు.ఆ ఊరిలో రాజయ్య అనే వ్యక్తి పాపయ్యతో చాలా సన్నిహితంగా ఉండేవాడు.
ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా!
డబ్బులు అన్ని ఏం చేస్తావు ?వారసులు కూడా ఎవరు లేరు నీకు. గ్రామానికి ఏదైనా సాయం చేయొచ్చు కదా! అని చెప్పేవాడు.కానీ పిసినారి అయిన పాపయ్య ఒక్క రూపాయి కూడా ఎవరికోసం ఖర్చు పెట్టేవాడు కాదు.ఎవరైనా సహాయం అడుగుతారేమోనని ఊర్లో ఎవరితో మాట్లాడకపోయేవాడు.
ఇలా రోజులు గడుస్తుండగా పాపయ్య వయసు మీద పడింది.చేతకాకుండా అయ్యాడు.తన పనులు తను కూడా చేసుకోకుండా ఆరోగ్యం క్షీణించింది.ఊరు వారు కూడా ఎవరు అతన్ని పట్టించుకోరు.తినడానికి తిండి లేక,సేవ చేసే వాళ్ళు లేక పాపయ్య వృదాప్యంతో మరణిస్తాడు.అన్నీ ఉన్న పాపయ్య తన పిసినారితనంతో తాను సుఖపడలేదు.
ఎవరికీ చిన్న సహాయం కూడా చేయలేదు. ఉన్నదాన్ని అనుభవించకుండా లేని దానికోసం ఆరాటపడే వాళ్ళు జీవితంలో సుఖపడరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి