న్యస్తాక్షరి---సాహితీసింధు సరళగున్నాల
విషయం:కుంభవృష్టి; 
ఛందం:ఉత్పలమాల
1వపాదం 1వ అక్షరం' శ్రా'
2వపాదం 2వ అక్షరం'వ'
3వపాదం11వ అక్షరం'ణ'
4వపాదం10వ అక్షరం'ము'

శ్రావణమాసమందు మది శర్కర తీపులనందునట్లుగా
నావన సీమలున్ పెరగ నాకృతి విందులనందజేయగా
పావుగ నాడిపించి జన ప్రాణమునిల్పెడు వానదేవుడే
మో వసుధాంకితుండునయి ముర్పెముపంచెను జీవజాతికిన్

కామెంట్‌లు