చారిత్రక ఆలయం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "తాతా!బోర్ కొడుతోంది.బైట వర్షం.ఇంట్లో కరెంట్ లేదు ఎలా?" పిల్లల అల్లరి గోల గోల అరుపులకి తాత అన్నాడు " రాజస్థాన్ దేనికి ప్రసిద్ధి? ఠక్కున చెప్పాలి" "ఓష్! ఎడారి ప్రాంతం.ఒంటెలకి ప్రసిద్ధి.""వేశారు పప్పులో కాలు! అక్కడ చూడాల్సిన అద్భుతప్రదేశాలు కట్టడాలు న్నాయి.""నిజంగా? ఏంటిది?" థార్ ఎడారి బికనేర్ పట్టణాన్ని చుట్టుకుని ఉంది.వేలాది హవేలీలు రసగుల్లా భుజియా కి ప్రసిద్ధి.40వేలలీటర్ల దేశీయ నెయ్యిని పునాది లో పోసి కట్టిన ఆలయం ఉంది.అది భాండాశాహ్ జైనమందిరం.బికనోర్ లోలక్ష్మీనాధ మందిరం సమీపంలో 5శతాబ్దాలకన్నా ప్రాచీన జైనమందిరం ఇది.భాండ్ శాహ్ అనేవ్యాపారి1468లో నిర్మాణం మొదలు పెట్టాడు.1541లో అతని కూతురు పూర్తి చేసింది.భూమి పైన 108 అడుగుల ఎత్తులో ఉన్న ఈజైనమందిరం లో 5వతీర్థంకరుడైన భగవాన్ సుమిత్ నాథ్ విగ్రహం ఉంది.3అంతస్థుల నిర్మాణం. భాండాశాహ్ ఓస్వాల్ నేతివ్యాపారి.అతను మేస్త్రీ తో మాట్లాడేటప్పుడు ఓ ఈగ నేతిపాత్రలో పడి చస్తే  సేఠ్ ఆఈగను బైటికి తీసి దానితో తన చెప్పులు రుద్దాడు.మేస్త్రీ అతన్ని ఓపిసనారిగా భావించి "అయ్యా! ఈ ఆలయం గట్టిగా ఉండాలి అంటే నీరు బదులు నెయ్యి పోసి కలపాలి." పాపం భాండాశాహ్ నిజానికి అతిమంచి బోళావాడు. అతని దాతృత్వం చూసి మేస్త్రీ పశ్చాత్తాపంతో తన చెడు ఆలోచనలు చెప్పాడు.దానికి సేఠ్ అన్నాడు" నేను భగవంతునికి అర్పించాను.నీవు వాడితీరాలి." అలా జరిగింది.ఇప్పటికీ బాగా ఎండవస్తే గోడలు నేలపై నేతి చారికలు వస్తాయి." తాత చెప్పింది విని పిల్లలు అన్నారు" దసరా సెలవుల్లో అక్కడికి వెల్దాం తాతా!" అలాగే అన్నాడు తాత🌺
కామెంట్‌లు