ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు. చాణక్యుడు తన చాణిక్య నీతి గ్రంధంలో మానవ విజయానికి అవసరమయ్యే ఎన్నో అంశాలను ప్రస్తావించాడు. మనం ఎవరితో స్నేహం చేస్తామో, ఆ వ్యక్త యొక్క సంగత్యం మనపై తప్పక ప్రభావం చూపించి మన విజయాలను కొంతవరకు ప్రభావితం చేస్తుందని ప్రస్తావించాడు.చాణక్యుడు కొంతమంది వ్యక్తులను ఎల్లప్పుడూ దూరం ఉంచాలని చెప్పాడు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
ప్రతి విషయాన్ని ప్రతి కూల దృక్పథంతో మాత్రమే చూస్తూ ఇతరులను ప్రోత్సహించే బదులు.. వారిని నష్టపరిచే విధంగా చర్యలు తీసుకునే స్త్రీకి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. దుష్ట ఆలోచనలు ఉన్న స్త్రీల నుంచి ఎప్పుడూ దూరంగా ఉండాలి. అటువంటి వారికి సహాయం చేయడం కూడా మనకు హానికరం.
తన వైఫల్యానికి దేవుణ్ణి శపించేవాడు.. ఎప్పుడూ ఇతరులను విమర్శించే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి.
చాణక్య నీతి ప్రకారం మూర్ఖులతో కలిసి జీవించకూడదు. మూర్ఖులకు ఏ విషయాన్నీ వివరించే ప్రయత్నం చేయరాదు. వారితో మాట్లాడటం అంతే మన శక్తిని వృధా చేసుకోవడమే.ఎదుటివారి విజయాలను చూసి అసూయపడేవారు లేదా తమ లాభం కోసం ఎవరికైనా హాని కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి.కష్టకాలంలో కూడా ప్రశాంతంగా ఉండాలి. మనం చేసుకునే పనుల్లో అనవసరంగా హడావిడి చేస్తే ఒత్తిడి కలుగుతుంది. సానుకూల ఫలితాలు రావాలంటే మన సామర్థ్యం పెరగాలి. అప్పుడే మనం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తేనే పనులు సజావుగా సాగుతాయి.
మన పనులు చేసుకునేందుకు వ్యూహాలు కావాలి. చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలి. అప్పుడే మనకు విజయం లభిస్తుంది. నిర్లక్ష్యంతో ఉంటే నష్టమే కలుగుతుంది. ఏ పని చేయాలన్నా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి