ఇంటి బరువునీడుస్తున్నా; -. కోరాడ నరసింహా రావు.
సాటి - తోటి పిల్లలంతా.... 
  చక్కగా బడికి పోతుంటే... 
   అర్దాంతరంగా,సదువొదిలేసి
     ఇంటి బరువునీడుస్తున్నా !
 
కలక్టర్ని అవ్వాలని... 
   నే దర్జాగా బతకాలని... 
      కలలెన్నో  కన్నాను... !
        ఆ తీపి ఊహలతో... 
         ఎంతో మురిసి పోయాను

 మమ్ము గన్న తల్లి, దండ్రులు.. 
  మమ్మనాధలను చేసి పోయిరి
  తమ్ముడినైనా చదివించి... 
   గొప్పవానిగా  చేయాలి  !

అమ్మా, నాన్నా లేని లోటును 
 నేనేకదా  తీర్చాలి... !
 నేను చదవలేక పోయినా... 
  వాడిని బాగా చదివించాలి !!
       ******
 ...

కామెంట్‌లు