గుణపాఠం, -బి.పల్లవి,-10వ.తరగతి,-తెలంగాణ ఆదర్శ పాఠశాల,-బచ్చన్నపేట మండలం,-జనగామ జిల్లా.

 తమ్మడపల్లి అనే ఊరిలో రాజు అనే ఒక బాలుడు ఉండేవాడు.అతనికి చదువుకోవడం అంటే అసలే ఇష్టం ఉండేది కాదు.వాళ్ళ నాన్నకు తనను బాగా చదివించాలని కోరిక.రాజు రోజు ఉదయాన్నే పాఠశాలకు వెళుతున్నట్టుగా నటించేవాడు.పాఠశాలకు వెళ్లకుండా పొలాల వెంబడి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు

పాఠశాలకు వెళ్లి వస్తున్నట్టుగా తల్లిదండ్రులతో అబద్ధం చెప్పేవాడు.ఇది గమనించిన ఉపాధ్యాయుడు ఒకరోజు రాజు వాళ్ళ నాన్నకు ఈ విషయాన్ని చెప్తాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆ విద్యార్థి గురించి వెతుకుతారు.రాజు స్నేహితులు రాజు ఎక్కడున్నాడో చెప్తారూ. ఉపాధ్యాయుని సహాయంతో రాజుని వెతికి పట్టుకుంటారు.ఎందుకు పాఠశాలకు రావడం లేదు. అని అడిగితే,నాకు చదివు అంటే ఇష్టం లేదని చెప్తాడు. సరే మంచిది "ఆ విషయం మాకు చెప్తే మేము బడి మానిపించే వారం కదా!ఇలా ఎందుకు చేస్తున్నావు". ఇంటికి పోదాం పదా అని తీసుకుపోతారు.తర్వాత రోజు రాజు వాళ్ళ నాన్న పొద్దున్నే రాజును నిద్ర లేపి తనతో పాటు వ్యవసాయం పనులకు తీసుకుపోతాడు. అక్కడ పొలం పనులు చేయిస్తాడు.రాజు ఎండకు భరించలేక ఆ పనిని చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు.చెట్టు నీడకు వెళ్లి కూర్చుంటాడు.అప్పుడు వాళ్ళ నాన్న రాజు దగ్గరికి వెళ్లి మేము చదువుకోక వల్లనే చిన్నప్పటి నుండి ఇలా కష్టపడుతున్నాము.నీకు ఇలాంటి కష్టం పదకూడదని,మంచిగా చదువుకొని బాగుపడాలని బడికి పంపిస్తున్నాము.కానీ నీవు బడికి వెళ్లకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్నావు. ఒక్కరోజే కష్టపడని వాడివి జీవితాంతం వ్యవసాయం పనులు ఎలా చేస్తావు?అని ప్రశ్నిస్తాడు. రాజు నుండి ఎలాంటి సమాధానం ఉండదు. బాగా ఏడుస్తాడు అప్పుడు వాళ్ళ నాన్న అందుకే నా మాట విని బడికి వెళ్లి చక్కగా చదువుకో !మంచి ఉద్యోగం వస్తుంది.జీవితం ఆనందంగా గడుస్తుంది.రాజుకు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు బాగా అర్థమయ్యాయి.ఆ రోజు నుండి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి బాగా చదువుకో సాగాడు. రాజు వాళ్ళ నాన్న రాజుకు కష్టం విలువ,చదువు గొప్పతనం తెలిసేలా చక్కగా గుణపాఠం నేర్పినందుకు ఉపాధ్యాయులు అభినందిస్తారు.


కామెంట్‌లు