నీ తోనే;- కేశరాజు వేంకట ప్రభాకర్ రావు , పాతర్లపాడు, ఖమ్మం.6281697982
నీతోనే...ఈ జీవితమంతా
అడుగంటే...ఆ సమయం వరకు
అలా అలా ఊహల్లో తేలి పోతు!!

ముద్ద మందారాలను !
ముగ్ధా ! నీ బుగ్గల పైనే పూయిస్తా
పెద్ద కడవల లోనికి,మధువును మృదువుగ తోడిస్తా!!

చుక్కల దింపి చక్కని మల్లియ పందిరికి వేలాడేసి
మినుకు మినుకు మంటున్న, తారల తళుకుల్లో నీతోనే!!

ఆకాశాన తెల్లని మబ్బుల తేరును
శ్వేతాశ్వాలు లాగుతుంటే
చల్లని పిల్ల సమీరాలు మెల్లగా మేనును
పులకింప జేయగ...నీతోనే రథా రోహణం!!

మంచు కొండల పైన కురియు
పిండి వెన్నెల మడుగులో నీతోనే
జతగూడి ఛెంగుమని దూకేద్దాం
కలహంసలంబోలి జలకంబులాడేద్దాం !!

జగతి నంతయు వినగ 
మృదు మధుర యుగళ గీతంబు పాడి
వినుతికెక్కేద్దాం ... విశ్వంబే మురియు
యుగాలు గడియ... మనమిద్దరమే ఉందాం!!


============

కామెంట్‌లు