పూజ;- డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం, నెల్లూరు. 6302811961
 ఏ వ్యక్తికైనా ఈ ప్రపంచంలో  ప్రతి  విషయం వెనుక ఒక శక్తి ఉన్నది అది నడిపిస్తున్నది అన్న భావం నమ్మకం ఉన్నాయి  వామపక్షపాతులైన కొంతమంది వ్యక్తులకు కూడా  ఈ అభిప్రాయం ఉండడంలో ఆశ్చర్యం లేదు  అయితే మనం ఏ శక్తిని ఆరాధించాలని అనుకుంటామో ఆ శక్తి  పై దృష్టిని కేంద్రీకరించి  పూజలు చేయడం భార్యాభర్తలు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు అంతా కూర్చుని సంప్రదాయబద్దంగా చేయడం మనం గమనిస్తూనే ఉంటాం  ఇది తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా ? అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తే చాలా మందికి తెలియదు అనే సమాధానమే వస్తుంది  దానికి కారణం  పూజకు ఉపయోగించే  వస్తువులు ఎందుకు ఉపయోగిస్తున్నారో మనకు పెద్దవారు చెప్పలేదు  అది తెలిస్తే పూజకు పునస్కారానికి  సఫలత చేకూరుతుంది. పత్రం ఫలం పుష్పం తోయం అని చదువుతాం  పత్రము అంటే  ఈ దేహం శరీరము  పుష్పము అంటే హృదయ కమలం ఫలము అంటే మనసు  దానిని నిశ్చలంగా ఉంచకపోయినట్లయితే దీని ఫలితం దక్కదు  తోయం అంటే నీరు అని అనుకుంటారు కానీ అది ఆర్ద్రతతో కూడిన  ఆనంద బాష్పాలు  కొబ్బరికాయ కొట్టడం ఎందుకో తెలుసునా పై పీచు మొత్తం  ఒక్కొక్కటి ఒక్కొక్క కోరికను కోరుతూ ఉంటుంది  ఆ కోరికలన్నీ తీరితే కానీ లోపల ఉన్నటువంటి నీరు అమృతం మనకు రాదు  దక్కదు. దీప హారతి ఎందుకో తెలుసునా  దైవమే కాంతి  ఆ కాంతికి గుర్తుగా మరి ధూపం అంటే వాసన కలిగిన సంచితానికి సంబంధించిన వాసనలు  తెలిస్తే చేసిన తప్పులను దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కర్పూర హారతి వెలిగిస్తాం  మనలో ఉన్నటువంటి హారతి  అహంకారం కరిగిపోవడం కోసం. గంటలు ఎందుకు కొడతాం ఏకాగ్రతను పెంచడం కోసం. ఆ గంట శబ్దానికి శృతి కలిపి చేయడానికి  గంధపు సేవ కష్టాల నుంచి  అధిగమించడం కోసం.  నమస్కారం  పంచేంద్రియాలను  జ్ఞానేంద్రియాలు కలిపి పది వేళ్ళు ఒకచోట చేర్చి  హృదయపూర్వకంగా వినయ పూర్వకంగా చేసే ప్రక్రియ  నీకు దాసోహము అని చెప్పడం  చివరిగా ప్రదక్షణ చేస్తాం  అది మూడుసార్లు చేయాలని శాస్త్రం సాత్విక రాజస తామస పద్ధతులను  ఏకోన్ముఖం  చేసి జీవితాన్ని కొనసాగిస్తాము అని ప్రమాణం చేయడం కోసం  ఈ విషయాలు తెలిస్తే తప్ప  పూజకు అర్థం లేదు  తెలుసుకొని చేసిన దానికి ఫలితం ఉంటుంది  మోక్షం దక్కుతుంది అంటారు పెద్దవాళ్లు.


కామెంట్‌లు