అలనాటి రామాయణ కాలం నుంచి ఈనాటి మన జీవన విధానం వరకు పరిశీలించినట్లయితే మానవ ప్రకృతిలో అందరూ మంచివారే ఉండరు అందరూ చెడ్డవారే ఉండరు ఎంత మంచి వారైనా ఒకటి రెండు లోపాలు ఉండక మానవు అలాంటి లోపాలు ఉన్నంత మాత్రం చేత అతనిని దూరం పెట్టకుండా అతనిలో ఉన్న ఆ చెడ్డ గుణాలను రూపుమాపడానికి ప్రయత్నం చేసిన వాడు మాత్రమే స్నేహితుడు అని పించుకుంటాడు అదే కరుడుగట్టిన అబద్ధాలు చెప్పే వ్యక్తి ఉన్నప్పుడు అతను చెప్పే మాటలను ఎంతమంది ఆలకిస్తారు ఒకవేళ విన్నా దానిని గుర్తుపెట్టుకునేవారు మనకు కనిపిస్తారా కనుక మంచి ఏదో చెడు ఏదో మనం నిర్ణయించుకొని మంచి వాడిని చేరదీయడం దుర్మార్గుణ్ణి దూరంగా పెట్టడం మన కర్తవ్యం. మంచి వారితో మాట్లాడేటప్పుడు వారి మాటల వలన మాత్రమే కాకుండా చేతల ద్వారా కూడా అతని మంచి ప్రవర్తన మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అతనితో కొంచెం సేపు మాట్లాడినా చక్కటి విషయాలు మనకు తెలుస్తాయి అవి జ్ఞాపకం పెట్టుకుని మన మిగిలిన మిత్రులతో అవి పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదే చెడ్డ వాడితో నువ్వు మాట్లాడినప్పుడు అతను చెప్పే ప్రతి అబద్ధం అని నీకు స్పష్టంగా తెలుసు అయినా మొహమాటం కోసం నీవు వినక తప్పదు ఆ వినడం వలన నీకు చెడు తప్ప మంచి జరగదు అని నీ అంతరాత్మకు తెలుసు కనుకనే అతని నోటి నుంచి వచ్చిన ఏ ఒక్క మాటను మనం మిత్రులతో కానీ తెలిసిన వారితో కానీ పంచుకోవడానికి అవకాశం లేదు అది నిజానికి దుష్టులకు శిక్ష. వీరిలో ఎవరితో నీవు మాట్లాడాలనుకున్న నీవు చెప్పదలుచుకున్న విషయాన్ని లేదా నీకు వచ్చిన అనుమానాన్ని తీర్చుకోవడం కోసమైనా ముందు వారు చెప్పేది వినాలి మంచి వారు చెప్పే పద్ధతిని గమనించి ఆ తరువాత చేయవలసిన కార్యక్రమాన్ని గురించి పరిష్కారాన్ని గురించి మాట్లాడితే అతను సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది అదే చెడ్డవాడు మాట్లాడేటప్పుడు నీవు ఏది మాట్లాడినా అది మంచి కానీ చెడు కానీ అతను భరించలేడు కనుక అతనితో ఉన్నప్పుడు మౌనం వహించడమే నీ ప్రథమ కర్తవ్యం మన పెద్దవాళ్ళు చెప్పే సూక్తిని ఎప్పటికీ మర్చిపోకూడదు నీటికి నాచు తెగులు మాటకు మాట తెగులు అని కనుక మాట్లాడే విధానాన్ని తెలుసుకోవాలి అంటే వాల్మీకి మహర్షి మాటలు వినక తప్పదు ఏ దేశస్థుని కైనా సరే.
మాట్లాడే విధానం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి