మా గ్రామంలో మొదటి పంచాయితీ అధ్యక్షులుగా ఉన్న వెంకట రెడ్డి గారిని కలిసి మీ మనసులో మాట వీడియో రికార్డు చేస్తానంటే నీ ఇష్టం రా అన్నారు. ఆ తెల్లవారి వెళ్లి రికార్డ్ చేశాను పంచాయతీ నిధులు ఎలా పోగవుతాయి వాటిని ఎలా వినియోగిస్తారు అన్న విషయంతో ప్రారంభించాను వివరంగా చెప్పారు గ్రామంలో బావులు చెరువులు గ్రామ వాసుల అవసరం కోసం చేయవలసిన పనులను మాత్రమే చేయాలి గ్రామానికి సంబంధించిన ధనం కనుక ప్రతి పైసా లెక్క చెప్పగలిగిన స్థితిలో ఎంతో పొదుపుగా వాడాలి రైతులకు మిగిలిన వారికి కావలసిన వనరులన్నిటిని పంచాయితీ వారే చూసుకోవాలి నాతోపాటు నాకు సహాయంగా ఉండే సభ్యులను కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటాం. విద్య వైద్య సదుపాయాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడవలసిన బాధ్యత కూడా మాకే ఉంటుంది అంటూ తాను చేసిన గ్రామ పురోభివృద్ధికి ఎలా పాటుపడ్డారో అన్ని విషయాలను చెప్పించుకున్నాను ఆ రోజు వారి మనవరాలు ఝాన్సీ అమెరికా నుంచి తన కుమార్తెతో సహా వచ్చింది తనను కూడా కూర్చోబెట్టి తేలప్రోలు వదిలి ఇతర దేశాలకు వెళ్లిన తర్వాత ఆమె జీవితం లో జరిగిన మార్పును గురించి చెప్పించాను. మొదట కెనడా వెళ్ళింది చదువు పూర్తయిన తర్వాత ఆ దేశస్తుని వివాహం ఆడింది ఒక ఆడపిల్ల ఆమెను తన తండ్రి జ్ఞాపకార్థం వైద్యురాలిగా తయారు చేసింది తర్వాత అమెరికా వచ్చి అక్కడే స్థిరపడింది అమ్మాయితో వైద్యం చేయిస్తోంది ఆమె తండ్రి పనిని కూతురు ద్వారా చేయిస్తున్నానన్న తృప్తితో ఉంది. ఆ వైద్యురాలికి తెలుగు అసలు రాదు అక్కడ ప్రాంతీయ భాషలు రెండు మూడు వచ్చు నేను అడిగిన ప్రతి మాటకు తనకు తెలిసిన భాషలో ఝాన్సీ తెలియజేయడం ఆవిడ చెప్పిందాన్ని నాకు తెలుగులో అనువదించి చెప్పడం ఝాన్సీ పని దాదాపు ఝాన్సీని చూసి 40 సంవత్సరాలు అయింది రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఆమె తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఇద్దరం నవ్వుకున్నాం కూడా నాటకం అంటే అదేదో కల్పితం అన్న భావం ప్రతి ఒక్కరికి కలుగుతుంది నాటికి నేడు అన్న నాటకంలో ఇదే పరిస్థితి దానిని ఝాన్సీ కి వివరంగా చెప్పిన తర్వాత నాటకాలు ఏవైనా ఏదో ఒక సంఘటన దృష్టిలో పెట్టుకొని జరిగిన విషయాన్ని ఇంకొంచెం కల్పనతో చేసేదే తప్ప అసలు జరగకుండా ఉండదు కదా అన్నది ఝాన్సీ.
మన గన్నవరం- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి