మన గన్నవరం-- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 తర్వాత కోటిరెడ్డి  నేను కలిసి అనేకసార్లు  ముక్కామల వారిని వారి ప్రగతి  ఆఫీసులో కలవడం  వారి పత్రికకు వీరు వ్యాసాలు రాయడం  ఆకాశవాణిలో వారితో పాటు కోటిరెడ్డి కూడా  పాల్గొనడం  వల్ల మా మధ్య బాగా సాన్నిహిత్యం పెరిగింది  దానితో వారు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసే సమయంలో మేం కూడా వెళ్లడం ఆ పద్ధతిని గమనించి కోటిరెడ్డి కూడా ఎంతో చొరవతో  ఒకరోజు నాకు అవకాశం ఇస్తారా  నేను ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే  మీరు ప్రక్కనే ఉండి నన్ను సరి చేస్తూ  నాకు శిక్షణ ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన చిరునవ్వుతో  మీలాంటి యువకులు వస్తే నాకు సగం భారం తగ్గుతుంది  రేపటి నుంచి ప్రారంభించండి అంటూ  అక్కడ వ్యాఖ్యాతలలో ఒకరిగా కోటి రెడ్డిని ఏర్పాటు చేశారు. తరువాత నా కన్నా చాలా బాగా చెబుతున్నావు  నీవు చదివిన చదువు దీనికి చాలా బాగా ఉపయోగపడిందని ముక్కామల వారే ప్రశంసించారు. కొన్ని రోజుల తర్వాత కోటిరెడ్డి తనతో పాటు పనిచేస్తున్న  మరో లెక్చరర్ని (కొండముది హనుమంత రావు) కూడా తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో తనతో కూడా వ్యాఖ్యాతగా ఏర్పాటు చేశారు వారు కూడా  ఖగోళ శాస్త్రాన్ని గురించి తెలిసిన వారే  అందుకే కార్యక్రమం రసవత్తరంగా ఉండేది వారు ఎంతసేపు చెప్పిన ఇంకా చెపితే బాగుంటుంది అనిపించేంత  అందంగా వ్యాఖ్యానించేవారు  తర్వాత ఈ విషయాలన్నిటిని  నేను చేస్తున్న వీడియో కార్యక్రమాలలో దాదాపు రెండున్నర గంటలు కోటిరెడ్డి తో ఖగోళ శాస్త్రాల గురించిన  విషయాలను అన్నిటిని సమగ్రంగా చెప్పించాను  భౌతికంగా వాడు మా మధ్య లేకపోయినా వాడు చెప్పిన విషయాలన్నీ ఎప్పుడూ  సజీవంగా ఉంటూనే ఉంటాయి. కనుక ఎప్పుడూ  వాడు మాకు సజీవుడే.
వారికి కలిసి వచ్చిన అదృష్టం  కోటేశ్వరమ్మ (భార్య) తను కూడా కళాశాల  లో ఉద్యోగిగా ఉండడం  ఈశాస్త్రంపై అభిరుచి పెరగడం  దానితో ఇద్దరూ ఒకే విషయాన్ని గురించి చర్చించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి ఒకరి సమస్యలను మరొకరు తీర్చడం వారిద్దరికీ తెలియని విషయాల గురించి పెద్దవారిని  కలిసి సంప్రదించి విషయాలను తెలుసుకోవడం  నాకు తెలియదు  అందువల్ల నేను  సిగ్గుపడుతున్నాను అని ఎప్పుడూ ఉండేది కాదు వాడికి ఎవరి దగ్గర ఏ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటే ఆ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవడానికి  ప్రయత్నించాడు తప్ప  నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను నేను ఇంకా నేర్చుకోవడం ఏమిటి అన్న  ఆలోచన ఎప్పుడూ లేదు నిత్య విద్యార్థిగా జీవించాడు  అది మాకు పాఠం.

కామెంట్‌లు