వృధా ఖర్చు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ జీవితంలో సంప్రదాయాలు  మొదటనుంచి ఎన్నో చేర్పులు మార్పులు చేసుకుంటూ  ఈనాడు ఈ సమాజం ఇలా ఉంది  ఒక సమయంలో  ఆడపిల్లలకు  ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఆచారంగా ఉండేది  ఆ కట్నాన్ని ఓలి అని పిలుస్తారు  దాదాపు డబ్బిచ్చి మనం ఏదైనా వస్తువును కొని ఇంటికి తీసుకువచ్చినప్పుడు మన ఇష్టం వచ్చిన పద్ధతిలో దానిని వాడుకుంటూ ఉంటాం  కానీ ఇక్కడ ఇది వస్తువు కాదు ప్రాణం ఉన్న జీవి  నీవు చెప్పినట్లుగా నడుచుకోవడం తనకు కూడా  స్వతహాగా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయా  ఆమె వాటినే అనుసరిస్తుందా నీవు చెప్పినది చేస్తున్నదా అని ఆలోచించాలి  తన ఇష్టం వచ్చినట్లు తన పనులు చేస్తూ ఉన్నప్పుడు  ఓలి ఇచ్చి తెచ్చుకున్న  కష్టం రా అని బాధపడక తప్పదు.
ఇవాళ ఏ కుటుంబంలో అయినా  వారంతట వారు చేసుకునే పనులు  కాదు  ఇతరుల పైన ఆధారపడ వలసినదే  ఇంటి పనుల నుంచి పొలం పనులు వరకు ప్రతి విషయంలోనూ  పాలేరులతో పనిచేయించుకోవలసినది  మనకు దొరికే వ్యక్తులు  ఒక్కొక్కసారి మంచి వారు దొరకవచ్చు మరొకసారి పని దొంగలు దొరకవచ్చు  వారి కైనా వీడికైనా నీవు డబ్బు చెల్లించవలసినదే నీకు ఉపకారం చేయడానికి రాలేదు వాళ్ళు  ఆ డబ్బుతో తన కుటుంబాన్ని తాను పోషించుకోవాలి అతని బాధ్యతలు ఉన్నాయి  కానీ తన బాధ్యత మరిచిపోయి ఇక్కడ పని చేయడం  మందంగా  సాగుతూ ఉంటే ఆ యజమానికి ఎలా ఉంటుంది  అతనికి ఇచ్చే జీతం వృధా అని బాధపడక తప్పదు.
కొంతమంది వ్యక్తులలో  కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి  ఆ గుణాలు మంచివైతే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది చెడ్డ ఆలోచనలతో చేసిన వైతే  ఆ చెడ్డ పనుల వల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది  ఒక్కొక్కరికి  వారికి తెలియకుండా ఒక్కొక్క  బలహీనత ఉండవచ్చు  ఒకరికి తిండి మీద ఉంటుంది మరొకరికి మందు మీద ఉంటుంది  ఇంకొకరికి మగువ మీద మనసు పడుతుంది  ఆ కోరికలను ఆపుకోలేరు కదా  వ్యభిచార గృహాలకు వెళ్లి వారి  కోరికలను తీర్చుకోవడానికి  డబ్బులు చెల్లించి  ఆమెతో కాలక్షేపం చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు  అతని మనసు ఎలా ఉంటుంది  ఆ కార్యానికి ఉపయోగించిన డబ్బులు అంతా వృధా  కనుక అలాంటివి వద్దు అంటున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.

"ఓజమాలు పొలతి యోలి మాడల చేటు పోటుకెడగు బంటు కూటిచేటు పనికిమాలు తొత్తు బత్తెంబు చేటురా..."


కామెంట్‌లు