మీదికొండ అనే ఊరిలో రమణయ్య,మీనయ్య అనే ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవారు.వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవారు. రమణయ్య అందరి మంచిని కోరేవాడు.మీనయ్య ఇతరులని చూసి ఎప్పుడూ ఈర్ష్య పడుతూ ఉండేవాడు. స్నేహితులైనప్పటికీ మీనయ్య రమణయ్యను చూసి కూడా ఈర్ష పడేవాడు.తనకు పంట ఎక్కువ పండిన చూసి ఓర్చుకోపోయేవాడు.తన పంటకు నష్టం కలిగేలా చేసేవాడు.ఏమీ తెలియనట్టు నటించేవాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఖర్చులు పెరిగి వ్యవసాయం భారంగా మారుతుంది.ఖర్చు ఎక్కువగా అవుతుంది. అప్పుడు రమణయ్య సహాయం చేసేవాడు. వరుసగా రెండు,మూడు సంవత్సరాలు మీనయ్యకు వ్యవసాయంలో చాలా నష్టం వస్తుంది.అప్పుడు రమణయ్య తనను ఆదుకుంటాడు.అప్పుల నుండి కాపాడుతాడు. స్నేహితుని మంచితనానికి మీనయ్య ఆశ్చర్యపోతాడు. తను ఎప్పుడు రమణయ్యని చూసి ఈర్షపడే వాడినని తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు.ముభావంగా ఉంటాడు.ఇది గమనించిన రమణయ్య "ఏం జరిగిందని అడుగుతాడు"అప్పుడు మీనయ్య తను అంతకు ముందుకు తన పంట నష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తాడు.రమణయ్య మంచి మనసుతో అర్థం చేసుకొని ఆ విషయం గురించి ఆలోచించొద్దని చెప్తాడు. స్నేహితుని క్షమిస్తాడు. మనం బాగుపడుతూ పదిమందికి సహాయం చేయడమే మానవ జీవితం యొక్క పరమార్థమని తెలియజేస్తాడు."నీవు నా స్నేహితుని.నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం నా యొక్క బాధ్యత"అని చెప్పి మీనయ్యను ఓదారుస్తాడు. అప్పటినుండి మీనయ్య ఇతరులను చూసి ఈర్ష పడడం మానుకొని,పక్కవారికి సహాయం చేస్తూ సంతోషంగా ఉంటాడు. స్నేహితులిద్దరూ మంచి మనసున్న మనుషులుగా ఊరిలో గొప్ప పేరు తెచ్చుకుంటారు.
ఈర్ష్య,;- ఇ.అఖిల,9వ.తరగతి,తెలంగాణ ఆదర్శ పాఠశాల,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి