నిజాయితీ ; - ఎండి. రియాజ్-9వ తరగతి-నీర్మల గ్రామం -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
 అనగనగ మోకిడి పల్లి అనే ఊర్లో ఒక సర్కారు బడి ఉండేది. ఆ బడిలో ఐదుగురు
ప్రానాస్నే హితులు ఉండేవాళ్ళు. వారు ఈ ఎప్పుడు కలిసి, మెలిసి ఉంటారు. వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటు ఉండేవారు. ఆ ఐదుగురు అన్నదమ్ములుగా యే మాట దాచుకునే వారు కాదు ఏది ఉన్న ఒకరి కొకరు చెప్పు కునే వారు. అప్పుడు ఒక రోజు ఆ ఐదుగురిలో ఒకడికి ఒక డబ్బులు ఉన్న డబ్బ దొరుకుతుంది.ఆ డబ్బుని చూడకుండా ఆ డబ్బాను తీసుకొని బడికి వెళ్తాడు. వెళ్తుండగా సార్ దానిని చూసి ఎంట్ర ఈ రోజు డబ్బ పట్టుకొని బడికి వస్తున్నావు అని అడుగుతాడు.అప్పుడు వాడు ఇలా అంటాడు సార్ సార్ మాకు ఇది రోడ్ మీద దొరికింది సార్ దీనిని తెరవ కుండానే తీసుకొచ్చాను సార్. అప్పుడు ఆ సార్ ఇలా అంటాడు అరెరే ఇది ఎందుకు తెచ్చార్రా అలా తేవడం తప్పు అని అంటారు. ఎందుకు సార్ అని ఈ ఐదుగురు అంటారు అప్పుడు సార్ ఇలా అంటాడు. అది ఎవరు పారేసుకున్నారు ఏమో పైగా అందులో డబ్బులు కూడా ఉన్నాయి. పాపం వాళ్లు ఎంత కష్టపడితే వచ్చాయో ఆ డబ్బులు ఏంటో అని అంటాడు సార్. అప్పుడు ఆ సార్ చెప్పినా మాటలు విని దొరికిన డబ్బాను తీసుకొని ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టి ఎవరిదో తెలిసేదాకా అక్కడే ఉండి వాళ్లకి అప్పగించి ఇంకా వారు కొన్ని డబ్బులు కూడా వాళ్లకి సహాయం చేస్తారు. ఇక ఆ ఐదుగురు ఇలా అనుకుంటారు అరే సార్ మనకి మంచి మాటలు చెప్పారు. మనం ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి అని ఆ ఐదుగురు అనుకుంటారు. ఇప్పటినుంచి వీళ్ళు ఏది దొరికినా తీసుకోకుండా వాటిని పారేసుకున్న వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉండి వాటిని ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ల గురువు చెప్పినది గుర్తు పెట్టుకున్నారు కాబట్టి. 

--------------------------------------------


 

నీతి: గురువులు చెప్పే మంచిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అలాగే వెళ్లే దారిలో ఏది దొరికిన అది మనదే అని అనుకోకూడదు ఎందుకంటే వారి కష్టం మనకి తెలియదు అందుకే ఏదైనా దొరికితే వాళ్లది వాళ్లకి అప్ప చెప్పేదాకా అక్కడే ఉండాలి.

కామెంట్‌లు