అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. వ్యాపారి పేరు రాజయ్య ఆయన స్వంతంగా పండ్ల తోట పెట్టుకున్నాడు. ఆయన పొద్దున్నే వెళ్లి తోట పనులు చేస్తాడు. ఆయనకి ఇద్దరూ పిల్లలు ఒక కూతురు, ఒక కుమారుడు. కూతురు పేరు రమ, కుమారుడు పేరు సురేష్. వాళ్లకి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. వాళ్లకు అంతా వాళ్ల నాన్నే చూసుకునేవాడు. పిల్లలని కష్టపెట్టకుండా చూసుకునేవాడు. పిల్లలని బడికి పంపుతున్నాడు. రాజయ్య పండ్లు తెంపి మార్కెట్ కి వెళ్లి అమ్ముతాడు. ఆ డబ్బులతో పిల్లల్ని చదివిస్తున్నాడు. పిల్లలకు అమ్మలేని లోటు లేకుండా పెంచుతున్నాడు. పండ్లు అమ్మి ఆ డబ్బుతో బియ్యం సరుకులు తెచ్చి పిల్లలకి కడుపునిండా భోజనం పెడుతున్నాడు. అలా జీవితం కొనసాగిస్తున్నారు. కూతురిది 10వ తరగతి అయిపోయింది. ఆమెకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. రాజయ్య వీళ్లు ఇద్దరే ఇంట్లో ఉంటారు. కొన్ని రోజులకు సురేష్ పెళ్లి, కూడా చేశారు. అప్పుడు కొడుకు కోడలుతోటి, రాజయ్య కలిసి వెలిసి సంతోషంగా ఉన్నారు. ఒకరోజు సురేష్, తన భార్యతో వేరే కాపురం పెట్టాడు. అప్పుడు రాజయ్య తన కూతురి దగ్గరికి వెళ్తాడు. అమ్మా రమ నీకెందుకు శ్రమ అని రాజయ్య అన్నాడు. రాజయ్య నా చావైనా బ్రతుకైనా ఇంట్లోనే, నేను వెళ్తాను. అని అన్నాడు రాజయ్య. సరే నాన్న నువ్వు జాగ్రత్త అని కూతురు అన్నది. తెల్లారి రాజయ్య మరణించాడు. అప్పుడు కూతురు కొడుకు వచ్చి బోరు బోరు నా ఏర్చారు. అన్నయ్య నువ్వు నాన్నని బాగా చూసుకుంటే నాన్న మనకు దక్కేవాడుకదా అని అన్నది. రమ. క్షమించు చెల్లి ఏదో వదిన మాటలు విని ఇలా చేశాను అని సురేష్ అంటూ బాధపడుతున్నాడు.
నీతి, ఉన్నప్పుడు తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. చనిపోయాక బాధ పడితే లాభం లేదు.
నీతి, ఉన్నప్పుడు తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. చనిపోయాక బాధ పడితే లాభం లేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి