న్యాయాలు -223
రుమాక్షిప్త కాష్ట న్యాయము
****
రుమ అంటే ఉప్పళము ఉప్పు గని సుగ్రీవుని భార్య అనే అర్థాలు ఉన్నాయని మనకు తెలిసినవే.క్షిప్త అంటే విసరబడినది,వెదజల్ల బడినది,త్రోసిపుచ్చబడినది,అవమానింపబడినది, అలక్ష్యం చేయబడినది,ఉంచబడినది...అనే అర్థాలు కలవు.కాష్ఠ అంటే చెక్క, కొమ్మ ,కట్టె , ఇంధనము,దూలము, కఱ్ఱ, కొలబద్ద అనే అర్థాలు ఉన్నాయి.
ఉప్పు నేలలో పాతిపెట్టిన లేదా మొలిచిన చెట్టు వలె... లేదా ఉప్పు రసమున పెరిగిన ఆకు కూర..ఈ రెండూ ఉప్పగా ఉంటాయి.
"యథా రుమాయాం లవణా కరేతు,మేరౌ యథా వోజ్జ్వల రుక్మ భూమౌ'/యజ్జాయతే తన్మయ మేవత త్స్యాత్త భవే ద్వేదవిదాత్మ తుష్టిః"
అంటే ఉప్పు భూములలో మొలిచిన చెట్లు ఉప్పుగానూ, బంగారంతో నిండియున్న మేరు పర్వతం మీద పుట్టిన చెట్లు,లతలు,పూల పొదలు మొదలైనవేమో బంగారు రూపాలను సంతరించుకుంటాయనీఅనగా బంగారంలో పుట్టినవి బంగారంగా, ఉప్పులో పుట్టినవి ఉప్పు వికారాలను కలిగి ఉంటాయని చెబుతూ వేదవేత్త యొక్క ఆత్మ తుష్టి అంటే ఆత్మ సంతృప్తి కూడా ఇలాంటి ఆలోచనలను బట్టి ఉంటుందనే అర్థంతో ఈ "రుమాక్షిప్త కాష్ట న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ న్యాయమును భౌతిక పరమైన అంశంగా కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో చూసి చెప్పారు మన పెద్దలు.
ఇక్కడ మానసిక వికారాలు అంటే మార్పులు.ఇవి మనం చేసే ఆలోచనలను బట్టి ఉంటాయనీ,ఆ ఆలోచనలే మనల్ని నడిపించే దారి దీపాలనీ అర్థం చేసుకోవాలి.
సరికాని ఆలోచనలు ఉప్పు భూముల్లాంటివన్న మాట.అందులోంచి ఏ ఆలోచనలు కూడా ఉపయోగపడవు.అవి ఒక విధంగా ప్రతికూలమైన భావనా వృక్షాలై మనసులో మర్రి చెట్టులా వ్యాపించి,ఇక ఏ ఇతర మంచి ఆలోచనల మొక్కలను మొలవనీయవు.
భౌతికంగా వ్యవసాయ రంగం పరంగా చూసినా మనకు అర్థం అవుతుంది.ఉప్పు నేలల్లో పంటలు సరిగా పండవు.పండినా దిగుబడి సరిగా రాదని.
ఇక బంగారు పర్వతంపై మొలిచిన చెట్లు, చేమలు బంగారు తత్వాన్ని అంటే ప్రకాశాన్ని పొందుతాయి అనడంలో అర్థం ఏమిటంటే మన ఆలోచనలు కూడా అలా వుంటే మనమూ నలుగురిలో బంగారంలా ప్రకాశిస్తాం , విలువైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతామన్నమాట.
కాబట్టి ఈ న్యాయము మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే మన మనసుల్లోని ఆలోచనలు ఉప్పు నేలలు కాకుండా బంగారు నేలలుగా మార్చుకోవాలి. తద్వారా నలుగురిలో బంగారంలా మెరిసిపోవాలి.
"ఇదండీ ఈ "రుమాక్షిప్త కాష్ట న్యాయము"లో నుండి తెలుసుకోవలసిన విషయము.
ప్రభాత కిరణాల మనస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి