తూరుపు వెలుగుల
మిలమిలలూ...
పుడమిని మెరుపుల
తళతళలూ
పైరు పచ్చల పాడిపంటల
కళకళ లూ
వాగువంకలా జలజలలూ
నదికి చేరిన జలసిరులూ
పచ్చదనం నిండిన
పుత్తడి నేలకు పండుగలూ
మెత్తగ వీచే మత్తు గాలులా
గలగలలూ
కనులపంటగా కమనీయంగా
విరిసిన పువ్వుల నవ్వులతో
తృప్తిగ తోచే జగమంతా
ఆశ నిరాశలెన్నున్నా
అడుగులు ఆగక సాగితే
సంతరించుకుని మార్పులు
అంతరించు తిమిరాలు
వసుమతికి వసంతం
తెచ్చు జనులకు సేమం
సస్య శ్యామలం ఇచ్చు
శుభ వరాల తాయిలం
ఎనలేని సుఖ సంతోషాల
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి