కట్టెకు ఎర్ర బట్ట కట్టి,
భుజాన గొంగళి చుట్టి,
నడుమున కాశె బోసి గోసి గట్టి,
గజ్జ కట్టి నీవు గళం విప్పితే,
కలలు కంటు నీ కలం నిజం కక్కితే,
లక్షల గుండెలల్ల ధైర్యస్థైర్య చైతన్యం నిండిపాయె
వేవేల మట్టి చేతుల గీతలు, వారి నుదుటి రాతలు మారిపాయె!
కానీ...
ప్రజాయుద్ధ నౌక ఇక మునిగిపాయెనా!
ఉద్యమ గొంతుక నేడు మూగబోయెనా!
విప్లవ సైనికుని జీవన పయనం ముగిసిపాయెనా!!
మరణం నీ పెయ్యికే గాని నీ పాటకు కాదు గద్దరన్నా!!!
లాల్ సలాం 🙏🏻
గద్దర్ అన్న లాల్ సలాం;- మేఘన శివాని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి