అమ్మానాన్నలు అలసిపోయారు.
గురువులు రాతల్లో మునిగిపోయారు.
మాకు ఇప్పుడు
విద్యాబుద్ధులు నేర్పుతున్నది
మంచి చెడులు తీర్చిదిద్దుతున్నది.
చరవాణి!!
అక్క తమ్ముడు చెల్లిని
అమ్మానాన్నలను మొత్తం ఈ కుటుంబాన్ని
విడగొట్టింది చరవాణి.!!
కొట్లాడుకోం-మాట్లాడుకోం
ఒంటరిగానే ఉంటాం మౌనంగానే ఉంటాం.!!
ఒళ్ళు మర్చిపోతాం కళ్ళు తెరిచి చూస్తాం
కాలం ఎంతో తెలియదు
ఆకలి దప్పికలు లేవు !!!
అదో భూతం ఒక అద్భుతం
మా చేతుల్లో చరవాణి!!!!!!!!!?
దాన్ని సరిగ్గా వాడుకుంటే
ఎవరెస్టులా గొప్పగా ఎదుగుతాం
లేదంటే
ఎవరెస్టులా కరిగిపోతాం అంతే!!!!?
అదో భూతం ఒక అద్భుతం
మా చేతుల్లో చరవాణి!!!!!!!!!!!!!!!!!?
15th August స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి