హయగ్రీవ! అచ్యుతుని రాజ్యశ్రీ
జ్ఞానానందుడై భాసించే
నిర్మల స్ఫటికాకృతితో వేదాల్ని 
బ్రహ్మకి అప్పగించే

శంఖచక్రాలు జ్ఞాన ముద్ర పుస్తకంతో నాల్గుచేతులతో
హయగ్రీవుడై ఉద్భవించే
ఆపేరున్న రక్కసుని చంపే

అశ్వంలోని చురుకుదనం
పాదరసంలా బుద్ధి హయగ్రీవ నామంతో ఆరాధనతో
శ్రావణ పౌర్ణమి పండువెన్నెలలా
వెలుగులతో జగతి జిగేల్🌷!

కామెంట్‌లు