నిజాల నిప్పు కణికలు;- -'బాలబంధు' గద్వాల సోమన్న
నిప్పులు తాకితే
నొప్పి కలగదా
అప్పులు పెరిగితే
ముప్పు ఉండదా

తప్పులు జరిగితే
శిక్షలు ఉండవా
పాపం పండితే
బ్రతుకులు మూఢవా

స్వార్ధం హెచ్చితే
తేలై కుట్టదా
అహం ముదిరితే
పామై కరవదా

నోరు జారితే
పోరు జరగదా
మనసు చలిస్తే
శాంతి వీడదా


కామెంట్‌లు