సాత్వికుడు పోతన;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి  ఆకారంలోనూ  ఆకలి దప్పులు తీర్చుకోవడంలోనూ  చేసే పనులు అది ఉద్యోగమైనా వ్యాపారమైనా మరి ఏదైనా  ఒకే పద్ధతిలో ఉంటాయి  ప్రతి ఒక్కరికి మనసు బుద్ధి అహంకారం  తప్పక ఉంటాయి  అవి ఆలోచించే తీరును బట్టి  అతని వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని  అంచనా వేస్తారు  సనాతన ధర్మంలో  సాత్విక  రాజస తామస అని మూడు రకాలుగా అదే రకంగా  ఉత్తములు మధ్యములు నీచులు అన్న పదాలు వాడతారు  ప్రతి ఒక్కరూ ఉత్తమ లోకాలకు వెళ్లాలని ప్రయత్నం చేసిన వారు  తప్పకుండా ఉత్తమ గుణాలను కలిగి ఉండాలి  దానికి ఆలోచనలు మంచిగా ఉండాలి దానికి తగిన మంచి పనులు చేస్తూ ఉండాలి  అప్పుడు మోక్షాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ధర్మాన్ని ప్రతిష్టించడం కోసం  వాల్మీకి మహర్షి రామాయణాన్ని  న్యాయాన్ని నిలపడం కోసం వ్యాస మహర్షి భారతాన్ని రాసి  మనకు అందించారు  ఆధ్యాత్మిక చింతనతో కూడిన  జీవితాన్ని గడపడం కోసం శ్రీకృష్ణ పరమాత్మను ఆదర్శంగా తీసుకొని  భాగవతాన్ని  వ్యాసులవారు మనకు అందిస్తే  అది సంస్కృతంలో ఉన్నది ఎవరికి అర్థం కాకపోవచ్చు అని  తేట తెలుగులో అందరికీ అర్థమయ్యేలా తాను అనువదించడానికి సిద్ధమై  భాగవత మహాకావ్యాన్ని  ఆంధ్రీకరించడం కోసం ప్రారంభించారు  బమ్మెర పోతన  మహానుభావుడు  నీ గర్వి  సహజ పాండిత్యం కలిగిన వారు. జన భాష తెలుసు కనుక ప్రజల కోసం ప్రజా భాషలో రాయడానికి  ప్రారంభించి  తనను గురించి తాను చెప్పుకున్న పద్ధతి  గమనించినట్లయితే ఉత్తములలో ఉత్తములుగా నడుస్తారు అని పోతన వ్యాఖ్యలు చదివితే తెలుస్తుంది మనకు. ఆదికవి నన్నయ కవి బ్రహ్మ అయిన తిక్కన మహాభారతం మొదలగు ఇతిహాసాలను రసవంతంగా తెలుగు వారికి అందించారు  కానీ ఆ మహాత్ములు ఎవరూ కూడా భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి  ముందుకు రాలేదు  అది  నాకోసమే విడిచి పెట్టినారా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు  ఇది నా పాలిటి మహాభాగ్యం  నా జన్మ రాహిత్యానికై భాగవతాన్ని తెలుగులో రచించినా జన్మను సఫలం చేసుకుంటాను  అని అనువాదాన్ని  ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు  నిజానికి భాగవత విశేషాలను సమగ్రంగా గ్రహించడం కానీ దానిని వివరించడం కానీ  బ్రహ్మకు కానీ చివరకు పరమ శివునికి కానీ సాధ్యమైన విషయం కాదు  మరి నేను ఎంతటి వాడిని  సజ్జనుల నుంచి తెలుసుకున్నవి చూసినవి నా శక్తిని బట్టి పొందుపరుస్తాను  అంటూ వినంబ్రంగా అక్షరాక్షరాలలో ప్రస్ఫుటం చేశారు.



కామెంట్‌లు