అష్టవధాని డ్రైవర్;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961.
 మధుమేహం  లేదా చక్కెర వ్యాధి అన్నది ఎందుకు వస్తుంది  తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అని మన వారు చెబుతూ ఉంటారు  దీనిలో ఎంతవరకు నిజం ఉంది  నిజంగా అదే కారణమైనట్టయితే తీపి పదార్థాలు తినే ప్రతి ఒక్కరూ కూడా ఆ వ్యాధికి గురి కావలసినదే కదా  కొంతమందికే ఎందుకు వస్తుంది  అని ఆలోచిస్తే అతని స్వార్థం ఎప్పుడైతే హృదయంలో పెరిగిందో  అప్పుడు వేరే ఆలోచనలకు మనసు తావు ఇవ్వదు  అలాగే మొండితనం  నాకు ఇదే కావాలి అనుకోవడం  నేను ఇలాగే చేస్తాను అని మొండి పట్టుదలతో కూర్చోవడం వల్ల  శరీరంలో  విపరీతంగా ఈ వ్యాధి పెరగడానికి అవకాశం ఉంటుంది  ఈ విషయాలన్నీ ఎవరో బయట వారు చెప్పినవి  కావు  మనవారు చెప్పడమే కాదు చేతల్లో చూయించింది కూడా  మన పెద్దలే.
నిజానికి ఎంతో ఇబ్బందులు పడి జీవితంలో  ఎన్నో అనుభవాలతో కూడిన  జ్ఞానంతో  అవతార ప్రక్రియ జరుగుతుంది స్త్రీలు ఎంత జ్ఞానులో  పురుషులు కూడా కొంత జ్ఞానులై ఉండాలి  అప్పుడు అవతారం  రక్తి కడుతుంది  అక్షరజ్ఞానం లేని వ్యక్తి  కుటుంబ పోషణ కోసం తన టాక్సీ నడుపుకుంటూ  ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న వాడు అవధాని కాగలడా  అతని కార్యక్రమాన్ని ఒక్కసారి ఆలోచించండి  ఎదుటివారి  అవసరాలను తీర్చడం కోసం తన టాక్సీని ఉపయోగిస్తున్నారు తన దృష్టి గమ్యం వైపు ఉంటుంది  ఎదురుగా వచ్చే వాహనాలు కానీ వ్యక్తులు కానీ అడ్డు లేకుండా చూసుకొని  వాటిని తప్పించుకుంటూ వెళ్ళవలసిన నేర్పు కలిగి ఉండాలి  లేకుంటే  ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తాను ఎదురుగా వచ్చే వాహనాలను  మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్లయితే  వెనకనుంచి  అడ్డదారుల్లో వస్తున్న వాహనాలు  ప్రక్కనుంచి వచ్చే  చిన్న సందులో నుంచి  వచ్చే బళ్ళు చూసుకోకపోతే  అతని పని జరగదు  మధ్యలో  తనతో పాటు వస్తున్న వారు ఇంకా ఎంత దూరం  ఇలా నిదానంగా వెళితే ఎలా  అని ఒకడు వేగం పెంచితే ఎలాగయ్యా మమ్మల్ని చంపడానికి తీసుకెళుతున్నావా అనే వర్గం మరొకరు  అప్రస్తుత ప్రసంగి  ఎప్పటికప్పుడు ఏ ఊరు దాని చరిత్ర ఏమిటి  అని అడగడం తప్ప  ఇంతమందికి సమాచారాలు చెప్పుకుంటూ  తనకు వచ్చిన కోపాన్ని  దిగా మింగుతూ  వారి గమ్యాన్ని  చేర్చడం తన బాధ్యతగా స్వీకరిస్తాడు  తన పని పూర్తి ఇంటికి వెళ్లిన తర్వాత అతని పరిస్థితి ఏమిటి  అతని బీపీ ఎంత పెరిగి ఉంటుంది  ఆలోచించండి  ఎదుటివారి కష్టాన్ని  తెలుసుకొని ప్రవర్తించవలసిన బాధ్యత మనపై ఉన్నది అని మరవకండి.


కామెంట్‌లు