సహనం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సహనం అనేది ఓర్పుగా  ప్రతి ఒక్కరికి భూషణంగా ఉండాలి. అది అలంకారం  ఎంత సహనాన్ని  అవలంబిస్తే అతను అంత  జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాడు అని మన  మునులు ఋషులు చెప్పిన మాట  వివేకానంద నుంచి మహాత్మా గాంధీ వరకు ప్రతి ఒక్కరూ ఆ సిద్ధాంతాన్ని అనుసరించి  భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి అన్నది  స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ చెప్పిన విషయం  ఒక సందర్భంలో వివేకానంద  రైలులో మొదటి తరగతి లో  ప్రయాణం చేస్తున్నాడు  మధ్యలో ఇద్దరు ఆంగ్లేయులు వచ్చి  ఇతని కాషాయ వస్త్రాలు  ఆయన పద్ధతి చూసి  ఇతను ఎవరో పల్లెటూరి బైతుగా ఉన్నాడు  అక్షరం ముక్క తెలియనివాడు  ఇక్కడ కూర్చున్నాడు అని ఎద్దేవా చేస్తూ వాళ్లిద్దరూ ఆంగ్లంలో ఏదేదో మాట్లాడుకుంటూ  వివేక  స్వామిని  ఎద్దేవా చేస్తూ మాట్లాడుకున్నారు. ఉలుకు పడుకో లేని వారి స్థితిని గమనించి  మన భాష అతనికి తెలిసినట్లుగా లేదు  అని మరి  నవ్వుకుంటూ చెప్పిన మాట  విని కూడా సమాధానం చెప్పలేదు స్వామీజీ  తర్వాత కొంతసేపటికి  టికెట్ కలెక్టర్ వచ్చి  ఆయన ఆంగ్లంలో మాట్లాడుతూ ఉంటే స్వామీజీ కూడా ఆంగ్లంలో సమాధానం చెప్పడం  ఎంతో వినయంగా అందంగా చక్కటి భాషతో  మాట్లాడడం చూసి ఆ ఇరువురు ఆంగ్లయులు ఆశ్చర్య పోవడంతో పాటు  మనం ఎన్ని తిట్లు తిట్టినా అతను వింటూ అర్థం అయి కూడా  ఎందుకు మౌనంగా ఉండవలసి వచ్చింది  దీనికి అతను కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఎందుకు నన్ను తిడుతున్నారు అని అడగవచ్చు కదా అలా మౌనంగా కూర్చోవడంలో ఏంటి అర్థం  అని వారిలో వారే  మాట్లాడుతున్నారు.
కొంత సమయం అయిన తర్వాత వారిద్దరిలో ఒకతను ధైర్యం చేసి  స్వామీజీ  మిమ్మల్ని మేము చాలా చులకనగా మాట్లాడాము  అది మీకు అర్థం అయింది  అయినా ఎలా మౌనంగా ఉండగలిగారు  అని ప్రశ్నించినప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు వివేకానంద స్వామి  మీరు ఎవరిని తిట్టారు  ఈ శరీరాన్ని తిట్టారా శరీరం లోపల ఉన్న  ఆత్మను తిట్టారా  మీరు ఎన్ని ఎక్కువ తిట్లు తిడితే అంత సహనం  పెరగకపోతే  నన్ను వ్యక్తిగా ఏ ఒక్కరూ పరిగణించరు  వారి కోసం నేను ఈ పని చేయలేదు  నన్ను నేను నిగ్రహించుకోగలనా లేదా  అని నన్ను నేను పరిశీలనాత్మకంగా  పరీక్షించుకున్నాను తప్ప మీ పైన ఏమాత్రం  ద్వేషం నాకు లేదు  అని సమాధానం చెప్పడంతో  అది వారికి ఒక పాఠం గా  జీవితాంతం  నిలిచి ఉంటుంది అనడంలో సందేహం లేదు.


కామెంట్‌లు