ఇల్లు సద్దుకోవాలి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ ప్రపంచంలో ఏది మంచో ఏది చెడో ఎవరు నిర్ణయించగలరు  ఒకరికి మంచి అనిపించింది మరొకరికి చెడు కాకూడదని నియమం ఏమైనా ఉన్నదా అంటే సమాధానం దొరకదు. పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ  అని ఆంగ్లంలో చెప్పిన  వాక్యం ప్రతివారికి  ఒక పాఠం  సంపాదన అన్నది ఒక వ్యామోహం అని  ఎంత సంపాదించినా ఆ దాహం తీరేది కాదని  భారతీయుడు చెప్పే నీతి  దానిని ఎంతమంది అనుసరిస్తున్నారు  సాక్షాత్తు భారతదేశం ప్రథమ ప్రధాని  విదురుడు చెప్పిన నీతిని ఎంతమంది అనుసరించారు  ప్రక్కన ఉన్న  దుష్ట దుర్యోధనుడే  అనుసరించలేని పద్ధతులను ఆయన చెప్పాడు  మనిషి సాధించలేనిది అనుసరించలేనిది ఏమైనా ఉంటుందా అంటే లేదనే సమాధానం వస్తుంది.
దానధర్మాలకు పుట్టినిల్లు భారతదేశం  సంపాదించడం మొత్తం  దానధర్మాలకు ఉపయోగించి చివరకు  అతి బీద స్థితిని అనుభవించమని ఎవరూ చెప్పరు. సినీ ప్రపంచంలో అందరికీ తెలిసిన వ్యక్తి  చిత్తూరు వి నాగయ్య గారు  ఆయన సంపాదించిన ధనం మరెవరూ సంపాదించలేదు సినీ రంగంలో  మొదట  సినిమా కథానాయకుడు  అనునిత్యం వారింట్లో వందమంది  కి పైగా అన్నప్రసాదం ఇస్తూ ఉండేవాడు  కన్ను మిన్ను కానక  చివరి రూపాయి వరకు ఖర్చు చేసిన వ్యక్తి  చివరకు ఎన్టీ రామారావు గారు  దయ దలచి చిన్న చిన్న పాత్రలను ఇప్పించడం  వల్ల వారి  వృద్ధాప్యం గడిచింది  తెలుగు సినీ చరిత్రలో  ప్రతి నాయకుడు అంటే ఆర్ నాగేశ్వరరావు అన్న పేరు తప్ప మరొకటి వినిపించదు  వారు ఎంత సంపాదించారో వారికే తెలియదు. అలాంటి వ్యక్తి మరణించినప్పుడు  భౌతికకాయాన్ని దహనం చేయడానికి కూడా ధనం లేని  దీనస్థితిలో ఉన్న సమయంలో  పెద్దలు ఆదుకున్నారు  విజయవాడకు సంబంధించిన కేవీఎస్ శర్మగారు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి  ఎన్టీ రామారావు గారికి బాగా నచ్చి  వారి ప్రతి చిత్రంలోను  వీరికి ఏదో ఒక పాత్ర ఇచ్చి  ప్రోత్సహించారు  చివరి రోజుల్లో మాతో పాటు చైర్మన్ నాటకం వేసి  ప్రదర్శన ముందు రోజు  వారి ఇంటికి వెళుతూ మెట్లు ఎక్కుతూ ఉండగా  కారుజారి పడి మరణించారు  ఆ సమయంలో కూడా ఎన్టీ రామారావు గారు  వారి దహన కార్యక్రమాలను చూసేలా  ఏర్పాటు చేశారు  విధురుల వారు చెప్పిన  8.3%  దానధర్మాలకు వినియోగించమని చెప్పింది  తెలియక సర్వం నాశనం చేసుకుంటే  చివరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది  దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని మన పెద్దలు చెప్పిన మాట  ఎంత యదార్థమో అర్థమవుతుంది.


కామెంట్‌లు