మతిమరపు;- డా.నీలం స్వాతి-చిన్న చెరుకూరి గ్రామం,నెల్లూరు.6302811961.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం  అది నడక కావచ్చు  కొన్ని ఆసనాలు కావచ్చు దేని వల్ల నైనా సరే శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి  ఈ శరీరంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో మెదడుకు కూడా ఆరోగ్యం అంత ముఖ్యం  మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే దానికి వ్యాయామం అవసరం  ఈ చదవడం వల్ల  మెదడుకు మంచి వ్యాయామం దొరుకుతుంది  ఒక విషయాన్ని చదివిన తర్వాత  ఆ విషయాన్ని మరొకరితో పంచుకుంటే  నీకు కలిగే ఆనందంతో పాటు  నీ జ్ఞాపక శక్తి పెరగడం వల్ల  మెదడు మరింత చురుకుగా పని చేయడానికి అవకాశం ఉంటుంది  ఈ ప్రక్రియ వల్ల  అల్జీమర్స్  లాంటివి త్వరగా రావు  మతిమరుపునకు ఈ చదువు మంచి మందు  కనుక ప్రతి ఒక్కరు పుస్తకం తీసి ప్రతి పేజీ తిప్పండి. మెదడుకు కొన్ని  పదాలు జ్ఞాపకం ఉంచుకునే శక్తి ఉంటుంది  ఆ పదాలు పెరిగినప్పుడు  ఆ కొత్త పదం మనసులో మిగులుతుంది పాతది ఒకటి  పరుగెడుతుంది  దానినే మతిమరపు అంటాం  అలాంటి స్థితి రాకుండా ఈ పుస్తక పట్టణం  మనలను కాచి రక్షిస్తుంది  ఇప్పుడు సాంకేతికంగా ఎంతో పెరిగిన  ప్రపంచంలో  స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత  ఏ మనిషి అయినా 8 నిమిషాల కన్నా ఎక్కువ దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు  దానిని సరి చేయాలంటే పుస్తకపట్టణం చేసి తీరాలి  ఈ పట్టణం వల్ల  ఏకాగ్రత పెరుగుతుంది  ఎప్పుడూ ఆ విషయం మీదే దృష్టి కేంద్రీకరించి  దానిని  మనసుకు అందించామో అది శాశ్వతంగా మెదడు గుర్తుకు పెట్టుకుంటుంది  అలా చేయడం వల్ల వ్యాయామంతో పాటు  భాషా పాటావం కూడా  పెరుగుతుంది. చదవడంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి  ఊరికే పుస్తకం ముందు వేసుకుని పేజీలు తిప్పటం చదువు అనిపించదు  మెదడుకు కొన్నిపరీక్షలు  పరిధులు  ఉన్నాయి  కొంత సమయం చదివిన విషయాలను మాత్రమే కనుక పుస్తకం చదవటం మొదలుపెట్టిన తర్వాత ఒక గంట సేపు చదివి  తిరిగి సాయంత్రం గాని రాత్రి గాని మరో గంట చదివినట్లయితే  ఆరోగ్యానికి మంచిది  మెదడు పని చేసినట్టుగా ఉంటుంది  దీనివల్ల ప్రత్యేక లాభం ఏమిటి అంటే  జీవించే కాలం పెరుగుతుంది  60 సంవత్సరాలు బ్రతికినవాడు 65 సంవత్సరాల బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని లాభాలు  ఉన్న పుస్తక పఠనం  ఎంత మంచిదో తెలిసిన తర్వాత కూడా దానిని అనుసరించకపోతే  అది మనకే నష్టం  కనుక ప్రతి ఒక్కరూ చదవటం  అలవాటు చేసుకోవాలి.


కామెంట్‌లు