స్వాతంత్ర సమరయోధులు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి  తమ ఆస్తులను అన్నిటిని దేశం కోసం  వినియోగించిన మహానుభావులు ఎంతోమంది  భారత దేశంలో ఉన్నారు  వారిలో మనకు అత్యంత ఆప్తుడు  ఆంధ్రుడు  రోజుకు వేలల్లో సంపాదన కలిగిన  లాయర్  మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత  ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది  కర్నూలు రాజధానిగా ఏర్పడిన  ఆనాటి  సభకు  ముఖ్యమంత్రిగా  ప్రకాశం పంతులు గారిని ఎన్నుకోవడం  శుభ సూచకం  వారిని అంటిపెట్టుకు తిరిగిన వారు  అలాగే రవీంద్ర నాథ్ ఠాగూర్  నిజాయితీకి  పెట్టింది పేరు  వారి శిష్యుడుగా  సాహితీవేత్తగా ఉన్న  డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు  ప్రకాశం గారికి కుడి భుజంగా వ్యవహరించారు  ఎవరికైనా  అధికారం చేతికి వస్తుంది అంటే  ఆశ ఉంటుంది.
ప్రకాశం పంతులు గారిని పక్కన పెట్టి  తాను ముఖ్యమంత్రి హోదాలో ఉండాలని  ప్రయత్నించి సఫలీకృతులయ్యారు  రెడ్డిగారు  ఆ రోజుల్లో వెన్నుపోటు అన్న మాట లేదు  గురుద్రోహి అనడానికి కూడా  వెనుకాడవలసి వస్తుంది  అలాగే ఒక రాజకీయవేత్తను పైకి తీసుకువచ్చి  తన శిష్యునిగా  శిక్షణ ఇచ్చి  నీలం సంజీవరెడ్డి గారిని  పైకి తీసుకురావాలనుకున్న సందర్భంలో  గోపాల రెడ్డి గారు చేసిన పనిని వీరూ చేసి ఆ సింహాసనాన్ని దక్కించుకున్నారు  వారు తీసుకువచ్చిన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా  మంచి  చదువరి  లాయర్ పట్టా ఉన్నవాడు  ఎత్తుకు పై ఎత్తులు వేయగలిగిన  ఆలోచనా పరుడు  సంజీవరెడ్డి గారి నిత్రోసి రాజు అని తాను  పీఠం ఎక్కారు. ఆయన తీసుకొచ్చిన పి.వి నరసింహ రావు గారు కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు  ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో చక్రవర్తి అని చెప్పాలి  అలాంటివాడు  తన సహాధ్యాయి వెంకట్ రామన్  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయానికి  తను కూడా హాజరై  అక్కడి మర్యాదలు చూసిన తర్వాత  ఆ పీఠం పైకి రావాలని కోరిక పుట్టింది  తర్వాత ప్రత్యేకంగా ఒక పార్టీని పెట్టి వారి ఉపన్యాసాల ద్వారా  అప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత రామారావు గారికి చాలా లాభాన్ని చేకూర్చింది  వారి తర్వాత రాజకీయ రంగ చరిత్ర  అంతా మనకు తెలుసు  దీని వెనుక ఉన్న ఒకే ఒక నీతి  అధికార దాహం  తన చేతిలో పవర్ ఉంటే  ఏమైనా చేయగలం అన్న  ఆలోచన  అలా చేయిస్తుంది


కామెంట్‌లు