అమ్మే...;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 భారతదేశ స్వాతంత్ర్య సముర్పర్జన కోసం ఎంతోమంది ప్రాణాలను అర్పించాడు  ఎంతోమంది ప్రాణాలను తీశారు కూడా సద్గుణాలతో పుట్టినవాడైనా దుర్గుణాలకు నిలయమైన వాడైనా  ప్రతివాడు తల్లి గర్భంలో 9 నెలలు ఉండవలసినదే  ఆ తొమ్మిది నెలలు తాను ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో  ఏది ఆహారంగా తీసుకుని జీవిస్తున్నాడో అతనికి తెలియదు  తాను భూమి మీదకు వచ్చిన తర్వాత  తల్లి ఒడి తప్ప మరొక సుఖం అతనికి లేదు తనను ఉయ్యాలలో పండుకోబెట్టి ఊపుతున్నా లేని సుఖం ఆనందం అనుభూతి  ఆ తల్లి ఒడిలో  నాకు తెలియని వయసులోనే దొరికింది  నేను ఎందుకు జనరేషన్ వాడినో ఎందుకు నవ్వే వాడినో నాకే తెలియదు. నా ఏడుపును పసిగట్టి  చీమలు దోమలు కుట్టినప్పుడు వచ్చిన ఏడుపా ఆకలితో అలమటిస్తూ చేసిన ఆక్రందనా  అమ్మకు మాత్రమే తెలిసిన పచ్చి నిజం. ఆ క్షణాన నన్ను ఎలా ఓదార్చలో  ఆమెకు మాత్రమే తెలుసు  నాకు లాల పోసికడుపు నింపిందో జోలపాడి నిద్రపుచ్చిందో నాకే తెలియదు  నా లేత అరచేతుల నుంచి  నా పాదాల వరకు  ముద్దులతో నన్ను మైమరిపిస్తూ  తాను ఎంత అమందానందం  అనుభవించిందో  ప్రపంచంలో ఏ బిడ్డ వర్ణించలేడు  ఆ అనుభూతికి విలువ ఎంత కట్టగలరు  నాకు ఆకలైతే నేను ఏమి తింటాను  ఏమి తినాలి ఆ వయసులో నాకేం తెలుస్తుంది  అన్నీ అమ్మే  చక్కగా మెత్తగా నలిపి ముద్దలు ముద్దలుగా తినిపిస్తూ ఉంటే  నా బుజ్జి బొజ్జ  నిండి చక్కగా నిద్రపోయేవాడిని  ఇది ప్రతి పిల్లవాడి అనుభవం.
వయస్సు పెరుగుతూ తన ఈడు వయసులో ఉన్న  పిల్లలతో తగాదాలు వస్తే  ఆ తగాదాలను తీర్చింది అమ్మ  ఒకవేళ నేనే తప్పు చేసినా  ఆ తప్పును సమర్థిస్తూ నన్ను వారి బారి నుంచి తప్పించేది  చదవడానికి ప్రారంభించినప్పుడు నాకన్నా తనే  చదువుతున్నట్లుగా భావించి నాకు నిద్ర వచ్చిన ప్రతిసారి లేపి చదివించేది  నాలుగు అక్షరాలు వంట బట్టి  నేడు ఈ ఉన్నత పదవిలో ఉన్నాను అంటే  దానికి పూర్తి కారణం అమ్మ కాదా  ఏ క్షణాన నాకు ఏ అవసరం వస్తుందో అమ్మకు తెలిసినట్లుగా నాకు తెలియదు కదా  అలాంటి అజ్ఞానిని విజ్ఞానినిగా చేసి  సంస్కారయుతమైన యువకునిగా ఈ సమాజంలోకి పంపించిన  తల్లి రుణాన్ని  ఏమిచ్చి తీర్చుకోగలను  నేటికీ అమ్మతో  పండుకున్న రోజులు  కలిగించే అనుభూతి  మరి దేనివల్ల మనం పొందగలం  అలాంటి అమ్మ  దేవతలను మించిన దేవత కాదా ఆలోచించండి.


కామెంట్‌లు