శంకరాచార్య;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇవాళ మనం అందరం  శంకరాచార్యుల వారిని జగద్గురువుగా కొలుస్తున్నాం  దానికి కారణం  అతిపిన్న వయసులోనే అరిషడ్ వర్గాన్ని  జయించి లౌకిక సుఖాలకు దూరంగా ఉండి  ఈ సమాజానికి ప్రపంచానికి నేను ఏం చేయగలను అని ఆలోచించి  దానిని ప్రచారం చేయడం కోసం  జీవించాడు తప్ప  తన వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదు  వారి మాటల్లో మన చెప్పుకునే  అరిషడ్వర్కాలలో మొదటగా చెప్పుకోదగినది కామం. కామము అంటే చెడు ఏమీ లేదు  కామము అంటే కోరిక  ఎదుట ఏ వస్తువులు చూసినా ఆ వస్తువు తన సొంతం చేసుకోవాలన్న అభిప్రాయంతో  దానిపై  మమకారాన్ని పెంచుకోవడం  దానిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నించడం  అది సాధ్యం కాకపోతే జీవితంలో  ఇబ్బంది పడడం  ఒకదాని తరువాత మరొకటి వరుసగా వస్తాయి.
తన ఆరోగ్యాన్ని గురించి  తన బాగు గురించి పెద్దలు ఎన్నో విషయాలు మనకు చెబుతూ ఉంటాడు  వాటిని తూ.చా. తప్పకుండా చేసినట్లయితే  ఎలాంటి రుగ్మతలకు వెళ్ళకుండా  ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది  కానీ మనసు అలా చేయనిస్తున్నదా  దేని పైన విపరీతమైన మక్కువ కలుగుతుందో  దానికోసం ప్రయత్నం చేయడంతోనే జీవితం కొనసాగుతుంది  ఎప్పుడు కామం ప్రారంభమైందో మిగిలిన 5  క్రోధ లోభ మోహ  మద మాత్సర్యములు ఒకదాని వెంట ఒకటి  మనలను ఆశ్రయించుకుంటాయి  దీనికి కారణం శంకరాచార్యుల వారు ఏం చెబుతున్నారంటే  మనం దేనిని చూసామో దానిమీద విపరీతమైన మక్కువ పెంచుకోవడం  గురించి విచారణ చేయాలి. వస్తు విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో  ఆ వస్తువు వల్ల మనకు జరిగే  ప్రయోజనం మంచిదా చెడ్డదా  మంచిదైతే ఈ కారణాలవల్ల  దానిని స్వీకరించవచ్చు  లేదా చెడు అన్న అభిప్రాయం  కలిగినట్లయితే  ఆ క్షణమే ఆ ఆలోచనలు మానివేయడం  వలన మనసు దానిపైకి వెళ్లదు  సామాన్యంగా ఎవరికైనా  మందు మగువ  సంపదలపై  ఆశ ఉంటుంది  ఇది సహజమైన కోరిక ఈ మూడు మనకు లభించినట్లయితే  ఐశ్వర్యం రావడం వల్ల  విపరీతమైన అహం పెరుగుతుంది  మందు వల్ల మనసు ఆలోచన నాశనం అయిపోతుంది  మగువ స్త్రీ వ్యామోహం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ క్షణానే అతని జీవితంపతనం అవడం ప్రారంభం అవుతుంది  ఇవి మంచి చేయకపోగా  విపరీతమైన చెడును చేస్తాయి కనుక వాటిని వదిలివేయడం శ్రేయస్కరం  అని మనసును అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నారు శంకరాచార్య  చెప్పడమే కాదు ఆచరణలో కూడా చూపినవాడు  కనుకనే జగద్గురువుగా ప్రసిద్ధి  చెందారు.


కామెంట్‌లు