మార్పు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని అనుభవాన్ని చెప్పడం సమంజసం అని నేను భావిస్తూ మీకు తెలియజేస్తున్నాను. మా నాన్న కు కుమారుడు తల్లిగారం చేయడంతో ప్రపంచంలో ఉన్న దురలవాట్లన్నీ  ఆయన చుట్టూ చేరి  100 ఎకరాల భూమిని  తన విలాసాలకు ఖర్చు చేయడం విశేషం  అలాంటి వాడికి అనుకోకుండా  ఏర్పేడు లో ఉన్న మలయాళ స్వామి  ఈ ప్రాంతానికి రావడం  అప్పటికి కలికాల వేదాంతమన్న నాటకాన్ని  దొంగ సాధువుల గురువుల  బండారాన్ని బయటపెట్టడం కోసం రాసిన  అనుభవం నాన్నకు ఉంది  వీడు కూడా అలాంటి  బాపతే అని  వారు విడిది చేసిన గుడారానికి వెళ్లి  వారిని దూషించి  బయటకు రావడం సాయంత్రం వేదాంత సభలో  మలయాళ స్వామి గారు కట్రోపనిషత్తు చెబుతున్న సందర్భంగా  వారి సభకు ఎదురుగా వీరు  తన మిత్రులు ముగ్గురితో సభ ఏర్పాటు చేసి  వారు మాట్లాడుతూ ఉంటే మైక్ అవసరం లేదు మైళ్ళ దూరమైన వినిపిస్తుంది  వారు మాట్లాడుతూ ఉంటే  స్వామి వారి దగ్గర ఉన్న శిష్యులందరూ  నాన్నగారి ఉపన్యాసానికి రావడం  స్వామి గమనించారు  వీరి ఉపన్యాసాన్ని స్వామీజీ కూడా శ్రద్ధగా విన్నారు  వారు ఏర్పేడు వెళ్లిన తర్వాత  ఒక సాధు పుంగవుని పంపి  నాన్నను ఏర్పేడు తీసుకువెళ్లారు  అక్కడ భగవద్గీత గురించి  మూడు రోజుల్లో ముగ్గురు గురువులు  మూడు అధ్యాయాలను  కర్మ  భక్తి జ్ఞానం గురించి  చెప్పడంతో  నాన్నకు పాత జీవితం పై విరక్తి కలిగి  తాను చేసిన పనులను మర్చిపోయి  తన పేరున  మార్చుకొని  స్వామీజీ కి దాసోహం అన్నారు. ఆశ్రమంలోనే ఉన్న సమయంలో స్వామీజీ పిలిచి  నీవు విన్న గీత సారాంశం నీకు ఏమి అర్థమైందో దాని గురించి నాకు  గ్రంథస్థం చేసి చూపించమన్నారు  వారి ఆజ్ఞ ప్రకారం గీతా సిద్ధాంతం  అన్న చెడు పుస్తకాన్ని వ్రాసి  స్వామీజీ చూయించిన తర్వాత  వారి మెప్పును పొందడం  ఆ  ఆనందంలో  గీతా సందేశం రాసి  ప్రతి శ్లోకానికి అర్థ తాత్పర్యాలు  విశేషాంశాలు  వ్రాయడంతో స్వామీజీ ఎంతో ఆనందించి  ఆ రెండు పుస్తకాలు వ్యాసాశ్రమం తరపున స్వామీజీనే  ప్రచురించి  సభాముఖంగా  నిరక్షరాశ్యులు కావడానికి  కృషి పట్టుదల ఉంటే చాలు  మన సమత్వనంద స్వామిని దానికి నిదర్శనం  అరిషడ్వర్గాలను  దూరం చేసి  గీత కొన్ని న్యాయం చేసిన స్వామిని  అభినందించడం నాన్న గారు జీవితంలో మరపురాని సంఘటన.


కామెంట్‌లు