అనగనగా ఒక ఊరిలో ఒక కొబ్బరి బొండాల వ్యాపారి ఉండేవాడు. ఆయన పేరు సత్తయ్య. ఆయన ప్రతిరోజు కొబ్బరి బొండాలు అమ్ముతాడు. సత్తయ్యకి ఒక భార్య కూడా ఉన్నారు. భార్య పేరు యాశోద. వాళ్లకు ఇద్దరూ కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు విజయ్. చిన్న కొడుకు పేరు అజయ్. వీళ్లు ప్రతిరోజు బడికి వెళ్ళుతారు. యాశోద నేమో మామిడి పండ్లు అమ్ముతుంది. విజయ్ అజయ్ చదువులు అయిపోయాయి. వాళ్లు విదేశాలకు వెళ్లి జాబులు చెయ్యాలన్నా వాళ్ల కోరిక. కానీ సత్తయ్య యశోద వాళ్ల దగ్గర డబ్బులు లేవు. వాళ్లు కొబ్బరి బొండాలు, మామిడి పండ్లు అమ్మి, కొడుకులను విదేశాలకు పంపాలి అని సత్తయ్య యశోద చూస్తున్నారు. ఒక సంవత్సరం నుండి పండ్లు ఇలాగే అమ్ముతున్నారు. పండ్ల డబ్బులు పోగు చేసి కొడుకులను విదేశాలకు పంపారు. కొడుకులు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. సత్తయ్య, యాశోదని బాగా చూసుకుంటున్నారు. వాళ్లకి పెండ్లి చేశారు. విజయ్ భార్య పేరు జ్యోతి, అజయ్ భార్య పేరు శ్రావణి విళ్లు అత్త మామలతో సంతోషంగా ఉన్నారు. విజయ్ కి కొడుకు పుట్టాడు. కొన్ని నెలలకు అజయ్ కి కూడా కొడుకు పుట్టాడు. అప్పుడు సత్తయ్య, యాశోద మనుమళ్లతో సంతోషంగా ఉన్నారు. సత్తయ్యని యశోదని కూడా విదేశాలకు తీసుకవెళ్లారు. అక్కడ అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారు.
నీతి, బాగా చదివి జాబులు అమ్మానాన్నలని బాగా చూసుకోవాలి. సత్తయ్య, యాశోద కష్టపడి పండ్లు అమ్మి, కొడుకులను బాగా చదివించారు. కొడుకుల కోరికలు సత్తయ్య ,యాశోద తీర్చారు.
నీతి, బాగా చదివి జాబులు అమ్మానాన్నలని బాగా చూసుకోవాలి. సత్తయ్య, యాశోద కష్టపడి పండ్లు అమ్మి, కొడుకులను బాగా చదివించారు. కొడుకుల కోరికలు సత్తయ్య ,యాశోద తీర్చారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి