గజేంద్ర మోక్షం (101 నుండి 110)
----------------------------------------------
మకరి తక్కువేమి గాదు
ఎదిరించుట సులువుగాదు
సరస్సు నందు తన బలము
వర్ణించగ తరము గాదు
ఓపిక నశియించె తుదకు
కోపము వచ్చెను చివరకు
ఒక్కసారి పైకి లేచి
చూసి దిగెను రంగమునకు
గోటీల వంటి కన్నులు
కను రెప్పనెత్తి చూపులు
మకరి చూపు వర్ణించగ
చంపెదననెడి లోచనలు
ఆహారం దొరుకుతుంది
రచ్చ తుదకు ఆగుతుంది
జంతు ధర్మ రీతినెంచి
భుక్తి కొరకు చంపనుంది
ఎవరి లెక్క వారిది
చేసేదేమున్నది
ఇరువురి ధర్మము నెంచగ
సమములోనె ఉన్నది
ముసిరిన చీకట్లను
సాధ్యమే! ఆపుటను
మోక్షంబుకు దారి జూప
ఎగసి పట్టె కాలును
బుజ బలాలు సమమైన
స్థల బలము జూసుకొనిన
కరి బలము తగ్గుతుంది
ఉండదు గాన నీటిన
కొండనైన తొలువ గలదు
దండిగ నివసించ గలదు
చూడబోతే చిట్టెలుక
కొండ ఏమి చేయ గలదు
ఎవరి శక్తి వారిదే
పుణ్యము దైవానిదే
కష్టమైన రణమందు
విజయము ధర్మానిదే
విజ్ఞానపు గరిమతో
దైవాన్ని పిలుచుటతో
విష్ణు మూర్తి వచ్చెనట
గజము కొరకు పరుగుతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి