హరివిల్లు రచనలు;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 296
🦚🦚🦚🦚
తాత్కాలిక ఉపశమనం
చూపదు పరిష్కారం......!
శాశ్వత నియంత్రణం
అభ్యాస చమత్కారం......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 297
🦚🦚🦚🦚 
కనిపించే మనిషికి
సంస్కారముండుటే సిరి...!
కనిపించని మనసుకు
నియంత్రణ తప్పనిసరి....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 298
🦚🦚🦚🦚
పరుల సమస్యలను
అమావాస్యగ భావించు...!
శుక్లపక్ష నడత నేర్పి
పౌర్ణమిగ పరిష్కరించు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 299
🦚🦚🦚🦚 
మాపటికి అందముండదు
మందార పుష్పములకు........!
రేపటికి జీవముండదు
అందుకో వేచి చూడకు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 300
🦚🦚🦚🦚 
నీటిపై తేలియాడే 
కలువపూలు అపురూపం...!
తేలికపాటి నీటి అల
దోచును ప్రతి రూపం..........!!
                (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు