జీవన సార్ధకత!;- డా. పి వి ఎల్ సుబ్బారావు - 94410 58797.
1.
  ఎనుబది నాలుగు లక్షల,
    జీవరాసుల ఈ సృష్టి !
 
 మానవ జన్మ అనేక,
పూర్వజన్మల పుణ్యాల పుష్టి!   

  మనిషికి సదా ఉండాలి,    
    సంపూర్ణ మానవతా దృష్టి! 

 నిత్యం కురిపించాలి,   
 సమాజాన కరుణారస వృష్టి!  

విశ్వాన వెలిగే మానవతే,
            మహనీయ సార్థకత!

2.ఈ మానవ నిర్మాణం,
       పంచభూత సమాహారం!
   
  ధరణికున్న సహనం
          జలంలాపారే ,లక్షణం !
 
  ఆగ్నియై దహించే గుణం,   
    వాయువులా సహజ వేగం!    

   ఆకాశ విశాల తత్వం,
          వెరసి మనిషి తనం !

   ఆ మనిషి తనమే ,
    అసలైన మానవ జీవనం!

3.
   అనాదిగా జగాన,
            మానవతే శ్రేష్టత !

  మనిషి మనిషిగా ,
     బతికితే ఎంతో ఘనత! 

   మానవత్వం మరిస్తే ,
          అదే పరమహీనత !

  ఎన్ని సాధించినా,
      దాని కుండదు చరిత! 

  జీవనదై ప్రవహించాలి ,
      మా నవతా సరిత! 
________
రేపు కొనసాగుతుంది,


కామెంట్‌లు