తెలంగాణ భీష్ముడు ఆదిరాజు వీర భద్ర రావు;----జాధవ్ పుండలిక్ రావు పాటిల్,భైంసా, నిర్మల్ జిల్లా, సెల్ నెం 9441333315

 నేడు ఆదిరాజు వీరభద్ర రావు వర్ధంతి
===============================
 ..చరిత్ర, సాహిత్య పరిశోధకుడిగా పేరుపొందిన ఆదిరాజు వీరభద్ర రావు 16 నవంబర్1890 లో ఖమ్మం జిల్లా మధిర తాలుకలో జన్మించారు. చరిత్ర రచన కళలో ప్రామానణిక స్థాయిని అందుకున్నారు. హైదరాబాదులోని చాదర్ ఘాట్ ఉన్నత పాఠశాలలో ప్రధాన తెలుగు పండితుడిగా పని చేశారు. ఆదిరాజు వీరభద్రరావు ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, జీవిత చరితావళి, మిఠాయి చెట్టు, సీతాబ్ ఖాన్, నవ్వుల పువ్వులు వంటి అమూల్యమైన రచనలు చేశారు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం లో 50 వ్యాసాలు రాశారు. గ్రీకు పురాణ కథలు వ్రాశారు.
లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన మొదటి వాడిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. తన ప్రతిభా పాండిత్యంతో, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు పొందిన ఆదిరాజు వీరభద్ర రావు గారు 28 సెప్టెంబర్1973 నా తుది శ్వాస వదిలారు. ఆయన రచనలు నేటికీ ప్రామాణికంగా తెలంగాణకు ఉపయోగపడుతున్నాయి.

కామెంట్‌లు