మన గన్నవరం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322.

 ఆ రోజుల్లో మానికొండ సూర్యావతి గారి పేరు తెలియని వారు ఎవరు  ఉండి ఉండరు  ఉదయం గారితో కలిసి  చాలా కార్యక్రమాలు విజయవాడలో చేశారు  వామపక్ష భావాలు  ప్రచారం చేయడానికి స్త్రీలలో కూడా  కమ్యూనిస్టు సిద్ధాంతాలను  నాటడానికి  ఎంతో కృషి చేశారు  1963 సంవత్సరం  లో నా వివాహానికి హాజరై  నాకు  మా అరుణకు ఆశీస్సులు అందిస్తూ చక్కగా ఉపన్యసించారు  నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రాకపోతే ఎంతో జీవితంలో నష్టపోయి ఉండేదాన్ని  ఉన్నత పాఠశాలల  విద్యార్థిగా ఉన్నప్పుడే ఆనంద్  స్టూడెంట్ ఫెడరేషన్ పేరుతో  కార్యక్రమాలు నిర్వహించేవాడు  వారి నాన్న అభ్యుదయవాది ఆదర్శవాది  వారి మాట  నిలిపేందుకు  ఈరోజు ఈ ఆదర్శ వివాహం జరుగుతుంది.
దానికి గోరా గారు అధ్యక్షత వహించడం  మరీ ఆనందం  ఇందుపల్లిలో జన్మించిన  సూర్యావతి గారు  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే విషయం  ఆమె నిజం చేశారు  ఆమె ఎంతో సౌమ్యంగా ఉంటారు ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటారు  1937లో అతిపిన్న వయసులోనే నందమూరి గ్రామస్తులు మానికొండ బుల్లి గారి కుమారుడు సుబ్బారావు గారితో వివాహం జరిగింది  భర్త, అత్త, బుల్లెమ్మ సహకారంతో ఆమె ఆధ్వర్యం లోనే మహిళా సంఘం లో చురుగ్గా పనిచేశారు  స్త్రీలలో అభ్యుదయ భావాలను  పెంపొందించడం కోసం మూడ ఆచారాలను పారద్రోలడం కోసం  అనేకమంది స్త్రీలను చేరదీసి  వారందరికీ మౌలిక సూత్రాలను తెలియజేసి  వారి నందరిని కార్యోన్ముఖులను  చేసిన ఘనత సూర్యవతి గారికి దక్కుతుంది.
1943లో జరిగిన కృష్ణా జిల్లా మహిళా మహాసభలో సూర్యావతి గారు కార్యదర్శిగా ఎన్నికయ్యారు  ఆ సంవత్సరంలోనే ఆమె కమ్యూనిస్టు పార్టీలో కూడా సభ్యత్వం స్వీకరించారు  పార్టీ పిలుపు మేరకు తన ఆస్తిని మొత్తాన్ని పార్టీకి అప్పగించిన తొలి మహిళ ఆమె  తాను మూడుసార్లు గ్రామ సర్పంచిగా  ఉంగుటూరు మండల అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీగా ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వహించారు  ఆమె కన్ను మూయడానికి కొన్ని గంటల ముందు 1993 జూలై 4న  41వ ప్రజాసంఘాల రాష్ట్ర సదస్సులో ప్రసంగించి  హాజరైన ప్రతి ఒక్కరిలోనూ ఉత్తేజాన్ని నింపారు  ఆమె జీవితం భావితరాలకు మార్గదర్శకం  ఆమె తల్లి భ్రమరాంబ తండ్రి కోగంటి పున్నయ్య గార్ల  ఆశీస్సులతో తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారు  వారి ఆశయాలను కొనసాగించడం మన బాధ్యతగా స్వీకరించాలి.

కామెంట్‌లు