మూర్ఖతత్వం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 మనిషి అంటేనే మనీష కలిగిన వాడు అంటే బుద్ధి ఉన్నవాడు  ప్రతివారికి బుద్ధి ఉంటుంది కదా దాని గురించి ఆలోచన ఏమి ఉంటుంది. దానికి జ్ఞానాన్ని చెప్పవలసిన అవసరం ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు  దానికి వేమన పద్యములో ఏం చెప్తున్నాడంటే  ఉన్న జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి  ఏ విషయాన్ని చెప్పినా దానిని వెంటనే గ్రహించి  దానిని జ్ఞాపకం ఉంచుకునేలా సాధన చేయాలి  అలా వాడితో సాధన చేయించినట్లయితే ఎంత అజ్ఞానిగా ఉన్నా  ఒక సంవత్సరం పాటు  అతనితో సాధన చేయిస్తేమంచి గురువు దొరికితే  అతనికి తప్పకుండా  జ్ఞానం పెరుగుతుంది  పుస్తకాలను చదవటమే కాదు  మానవ తత్వాలు కూడా కొలవగలిగిన జ్ఞానం  సొంతం అవుతుంది.
మాటలు రాని మూగవానిని  భరించడం కష్టం  మనం చెప్తున్న విషయాలు తనకు అర్థం అవుతాయి కానీ తాను చెప్పిన విశేషాలు మనకు తెలియవు  వ్యక్తీకరించే సత్తా లోపించడం వల్ల  అలా జరుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు  అలాంటి మూగవాడిని తీసుకు వచ్చి  జ్ఞానాన్ని సంపాదించాలన్న కోరిక అతనిలో ఉంటే  ఎంతో ఓపికగా చెప్పగలిగిన గురువు  దొరికితే  అక్షరాభ్యాసం నుంచి  వేదాలు చదివే అంతవరకు  అతనికి జ్ఞాన బోధ చేయవచ్చును  ఎంతో సమయం కూడా తీసుకోడు  తెలుసుకోవాలి అన్న  అభిలాష అతనిలో ఉండడంవల్ల  నెల రోజులలోనే  తాను ఏ జ్ఞానాన్ని సంపాదించదల్చుకున్నాడో దానికోసం మరింత కృషి చేసి  దానిని సాధించే అవకాశం ఉంటుంది అంటున్నాడు వేమన. ఇక మూడవ రకం వ్యక్తులు  మూర్ఖులు ఉంటారు  శంకరాచార్య మూడులు మూర్ఖులు అని  రెండు రకాలుగా విభజించాడు  ఒకటికి రెండుసార్లు చెప్పితే అర్థం అవుతుంది మూడులు అదే మూర్ఖుడిని తీసుకోవచ్చు  నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాను  అంటే  జ్ఞానానికి జ్ఞానాన్ని చెప్పగలిగిన  జ్ఞానిని నేను  నాకే చెప్పగలవా అంటూ ఎదురు తిరిగి  బలవంతం మీద కూర్చుని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన   ఒకటి చెప్పితే మరొక దానిని పలికే  అతని అతి తెలివి వల్ల  30 సంవత్సరాలు నేర్పిన అతను జ్ఞానికాలేడు అని నిర్ధారిస్తున్నాడు  వేమనయోగి  అసాధ్య  మైన కార్యాలలో  అసాధ్యమైనది  ఈ  మూర్ఖుని మూడులునిగా చేయడం  అని తేల్చి వేశాడు వేమన. వారు రాసిన పద్యాన్ని చదవండి.

"యడ్డె దెలుపవచ్చు యెడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు ముప్పె దెలుప రాదు ముప్పదెండ్లకునైన..."



కామెంట్‌లు