జీవిత దశలు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ జీవితంలో ఎన్ని దశలు ఉంటాయో  ఒక్కొక్క దశలో ఎన్ని పద్ధతులలో జీవితాన్ని ఆలోచించుకుంటూ ఉంటాడో ఆ వయసులో  తనకు తగిన పనులను చేస్తూ  ఎలాంటి సుఖాలను అనుభవించాలని  తపనపడతాడో మనం అంచనా వేయడం కష్టం  పుర్రెకొక బుద్ధి అని మన పెద్దవారు చెప్తారు  అందరూ ఒకే రకంగా ఆలోచించరు  ఎవరి అభిరుచి మేర వారు  దానిని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ధనం విషయంలో కావచ్చు  స్త్రీ విషయంలో కావచ్చు  తనకు కావలసిన నిత్య అవసరాలకు సంబంధించిన  విషయాలు కావచ్చు  ఎన్ని ఆలోచనలు వస్తాయో  దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో  ఎవరెవరిని చేరదీస్తే ఆ పనులు అవుతాయో  అన్ని ఆలోచనలతోనే సరిపోతుంది.
ఈ భూమి మీద ఏ బిడ్డ  కాలుపెట్టిన  తాను ఈ భూమిని వదిలి వెళ్ళే రోజు కూడా  బ్రహ్మ ఆ బిడ్డ మొహాన రాస్తాడు అని  శాస్త్రం చెబుతోంది  పుట్టిన వాడు గిట్టక తప్పదు అని  నానుడిగా కూడా చెప్తారు  పుట్టిన వ్యక్తి మరణించడం మరణించిన వ్యక్తి మళ్ళీ పుట్టడం  జరుగుతూ ఉంటుంది అని శంకరాచార్యులు వారే మనకు తెలియజేశారు  అయితే ఆ మరణం అనేది ఎలా సంభవిస్తుంది ఎప్పుడు సంభవిస్తుంది  దానికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా  అని ఆలోచించినట్లయితే  తన ఆరోగ్యం సక్రమంగా ఉన్నంతవరకు ఆ జీవి హాయిగా  జీవిస్తాడు  ఏ క్షణాన గుండె పని చేయడం మానుకుంటుందో  ఆ క్షణాన అతని భౌతిక కాయం ఎందుకు పనికిరాకుండా పోతుంది  మరణించిన వాడికి ఇంకా ఆలోచనలు ఏమిటి.
దీనిని అద్భుతమైన  ఉపమానంతో చెప్తున్నాడు వేమన  ఉపమా కాళిదాసస్య  అని మన పెద్దలు చెబుతాడు తప్ప  వేమన చెప్పే ప్రతి మూడు పద్యాలలో రెండు పద్యాలకు  ఉపమానం ఉండి తీరుతుంది  వీరిని గురించి మాట్లాడిన వారు తక్కువ  ఒక దీపం వెలగాలి అంటే దానికి కావలసిన పనులు ఏమిటి  ముందు దానిలో నూనె కావాలి  దానిని  కాంతివంతంగా చేయడానికి  దూదితో కూడిన ఒత్తిని తయారు చేయాలి  ఆ తర్వాత దానిని వెలిగించి  అది ఆరిపోకుండా ఒక  గ్లాస్ ని పెట్టి  వినియోగదారుడు  దానిని వాడుతూ ఉంటాడు  దానిలో నూనె  అయిపోయేంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది  నూనె పూర్తిగా  అయిపోయిన తర్వాత దానికి  వెలుగు ఉండదు  అదే ఈ మానవ జన్మ  అంటూ వ్రాసిన పద్యాన్ని ఒకసారి చదవండి.


"చమురు గలుగు దివ్య నరవితో మండును చమురు లేని దివ్య సమసిపోవు  తనువు తీరునేని తలపు తోడనె తీరు..."కామెంట్‌లు