ఊహా ప్రపంచం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రేమ వాత్సల్యం  స్నేహం  రకరకాలుగా ఉంటాయి మనసును చూసి అభిమానించేవాడు కొందరు.  మంచి పనులు చేసే వాడిని చూసి ఆకర్షించే వారు మరి కొందరు  ఆకాశవాణికి సంబంధించినంతవరకు  వారి గొంతుని విని  ఆకర్షించి అభిమానాన్ని పెంచుకునేవారు వేల సంఖ్యలో ఉంటారు  కొందరిని మాత్రమే  అభిమానించే వారు కొందరు ఉంటారు  కొందరిని అసహ్యించుకుంటూ ఏమిటి అతని మాటలు అంటూ  విరక్తిగా మాట్లాడే వాళ్లు కొందరు ఉంటారు  ఒక వ్యక్తి  తన అభిమాని ప్రతిరోజు ఎంతో  ఆప్యాయంగా తన కార్యక్రమాల గురించి మాట్లాడడం  మిమ్మల్ని చూడాలని ఉంది  ఎప్పుడు రమ్మంటారు మరి కొంతమంది  ఉండడం సహజం  ఒక పర్యాయం ఆమెను ఫలానా సమయానికి రమ్మని  తాను కలుస్తానని చెప్పాడు  నా స్నేహితుడు. ఎంతో ఉత్సాహంతో మా అందరితో  ఎంతో అందంగా ఉండి ఎంతో చక్కగా మాట్లాడే నా స్నేహితురాలు నా అభిమాని వస్తుంది మీరందరూ కూడా చూడండి మిమ్మల్ని కూడా పరిచయం చేస్తాను అని  చెప్పడం  మేమంతా ఆ సమయానికి రావడం  ఆ సమయంలో 16-17 సంవత్సరాల పాపతో పాటు  మరొక  ముగ్గురు స్త్రీలు వచ్చారు  ఆ పాప ఎంతో అందంగా ఉంది  వీడు ఎంతో ముగిసిపోయాడు  ఆ పాప  చక్కగా మాట్లాడుతూ తనతో వచ్చిన ముగ్గురిని  పరిచయం చేసి  ఈమె మా అమ్మమ్మ  ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉండేది ఈమె  మీ మాటలను మీరు చెప్పే పద్ధతి అన్నా అందరు చాలా ఇష్టం  మీరు నటించిన నాటకాలు  తప్పకుండా వింటుంది అని ఆమెను పరిచయం చేసింది  అప్పుడు వారి మొహం చూడాలి  పాపం  అనిపించింది. ఈ అంశం లాంటిదే తీసుకుని  వేమన ఆయన కాలంలోనే రాశాడు చక్కటి పద్యం  ఒక ఎర్రటి స్త్రీని చూసినప్పుడు ఆమె పై ప్రేమ అభిమానం పెరుగుతాయి  ఆమెతో మాట్లాడాలని ఆమెతో స్నేహం చేయాలని ఆమెను  వివాహం చేసుకోవాలని కూడా అనుకున్న వాడు  ఆమె తన దగ్గరకు వచ్చినప్పుడు  ఆమెను పొగడ్తలతో నింపి  తన మనసులో అభిప్రాయం తెలుసుకోవడానికి ముందు  ఆమె నవ్వును చూసాడు  ఆ పళ్ళను చూడగానే పాపం  పసివాడు అయిపోయాడు  ఆ క్షణమే అతనికి ఆమె కామపిశాచి లాగా కనిపించింది  ఏం చేస్తాడు  ఊహలు వేరు వాస్తవాలు వేరు అని తెలుసుకుంటేనే జీవితం సక్రమంగా సాగుతుందని వేమన చెబుతున్నాడు వారు రాసిన ఆ పద్యాన్ని చదవండి.

"ఎర్ర నాడుదాని నేపార జూచిన వేకి వుట్టి జాల వెర్రిబట్టు పల్లు దెరచి నగిన బట్టు పెన్బూతంబు..."


కామెంట్‌లు