జనకవి జాషువ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రాజు మరణించె యొక తార రాలిపోయె సుకవి మరణించిన  ఒక తార గగనమెక్కె రాజు జీవించు రాతి విగ్రహము లందు సుకవి జీవించు ప్రజల  నాల్కల యందు  అని  ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక కవి గుర్రం జాషువా గారు అంటే ఏమి అతిశయోక్తి ఉండదు  నిష్పక్షమైన భావవ్యక్తీకరణ జాషువా సొంతం  జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని నాకు గురువులు ఇద్దరు ఒకటి పేదరికం రెండోవది కుల వివక్ష ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండవది  నాకు ఎదిరించే శక్తిని  పెంచిందే కానీ బానిసగా  మాత్రం మార్చలేదు తన అనుభవలు అన్నింటిని  కలం లో ఇమిర్చి  సమాజానికి తెలియజేసిన వ్యక్తి  తనను గురించి స్వీయ చరిత్ర పద్య కావ్యంగా వ్రాశారు
 సంస్కృతంలో కాళిదాసు కు ఎంత పేరు ఉంది తెలుగులో జాషువాకు అంత పేరు ఉందో  తెలుగు వాంగ్మయం జాషువా మయం  వారి  కుటుంబ పరిస్థితి  వారికి ఎన్నో పాఠాలు నేర్పింది. వారి కవిత్వాన్ని విని మెచ్చుకున్న వారే. వారి కుల ప్రస్తావన వచ్చేసరికి మొహం తిప్పిన సందర్భాలు ఉన్నాయి  గవ్వకు సాటి రాని పలుగాకుల మూకలసూయ చేత నన్నెన్విది దూరినన్ సూర్యుని నన్ను వరించిన శారద లేచిపోవునే  వసుధా స్థలిన్ బుడమరే రసలుబ్దులు  కంఠమునెదన్ రవ్వలు దల్చేదన్ గరగల్ సవరించేద నాంధ్ర వాణికిన్ అని తన శక్తిని నిరూపించుకున్న వాడు  ఒక సందర్భంలో వారి కవితలను మెచ్చి  వారికి సన్మానం చేయాలన్న సంకల్పంతో అనేకమంది  తిరుపతి వెంకట కవుల సమక్షంలో  జరగాలని నిర్ణయించుకున్నారు.
కాలికి కడియం తొడగవలసిన  తిరుపతి కవులు  జాషువా భుజం తట్టి అదృష్టవంతుడివి నీవు జాషువా  అన్నారంటే వాడిని పట్టుకోవడం వాడికి ఇష్టం లేదని  అర్థం చేసుకోవచ్చు  అలాంటి సందర్భాల  ఎన్నో.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం