ప్రధమ జ్ఞాన పీఠ బహుమతి గ్రహీత- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఆకాశవాణికి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి  మేధావి వర్గంలో ఎవరికైనా  గొప్ప బహుమతి లభించిన  ఏదైనా బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన  వారిని అభినందించే కార్యక్రమం చేస్తూ ఉంటుంది  అలాగే గొప్పవారు మరణించినప్పుడు  వారికి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని  ఏర్పాటు చేస్తుంది  మరణించిన వ్యక్తిని గురించి చెప్పగలిగిన వ్యక్తులు ఎవరు ఉన్నారో ఎన్నిక చేసి  వారి పరిచయంతో పాటు  మరణించిన వారి గురించి  చెప్పించడం  ఆకాశవాణి అలవాటు  బ్రహ్మ వేత్త  వేలూరి శివరామ శాస్త్రి గారు మరణించినప్పుడు  నేను ఉషశ్రీ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్లి  శాస్త్రి గారి గురించి నాలుగు వాక్యాలు చెప్పండి అంటే  వాడి గురించి చెప్పడానికేముందిరా  ఏమీ లేదు అన్నారు. 
ఒక ఆంగ్లేయుడు వచ్చి నీ పేరేమిటి అని ఆంగ్లంలో అడిగితే సమాధానం చెప్పలేక పోయారు.అప్పుడు వారి అబ్బాయి ద్వారా  శంకరనారాయణ నిఘంటువు తెప్పించుకుని  ఆంగ్ల భాష నేర్చుకున్నారు  సోమవారం అతను వచ్చిన తర్వాత  అతనితో ఆంగ్లంలో మాట్లాడుతూ ఆంగ్లేయుడు మాట్లాడుతున్న ఆంగ్ల శబ్దాలలో ఉన్న  ఉచ్చరణ గురించి  వ్యాకరణ దోషాలను గురించి  మాట్లాడుతూ ఉంటే  అతనికి నోటి వెంట మాట రాలేదు  ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు అని చెప్పి  శాస్త్రి గారికి పాదాభివందనం  చేసి వెళ్ళాడు  ఆ వేడిలోనే  వారానికి ఒక భాష చొప్పున  18 వారాలలో  18 భాషలను నేర్చుకున్న  గొప్ప మేధావి  వారి అబ్బాయి  మీకు ఇది ఎలా సాధ్యమైంది నాన్న అని అడిగితే  శబ్ద మంజరి చదివిన నాకు  ఇది ఒక లెక్క కాదు  అని సమాధానం ఇచ్చారు  అలాంటివారు మరణించడం మనకు  ఎవరు  పూరించలేని  లోపం. వృద్ధాప్యంలో  ఏకాంతంగా ఉండాలన్న అభిప్రాయంతో  వారి నివాసాన్ని వదిలి  వారి తోటలో  చిన్న పర్ణ కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్లారు  ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ జీవితం గడుపుతూ  మంత్ర శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను  నిగూఢంగా  సంస్కృతంలో దాగి ఉన్న రహస్యాలను  అన్నిటినీ తేట తెలుగులో అందరికీ అర్థమయ్యే పరిభాషలో రాశారు  తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి  చేశాడని సామెత  ఒకరోజు ఆయన  వాహ్యాళికి  వెళ్లి వచ్చే లోపు  వారి కుటీరం దగ్ధమైంది  దానిలో వారి వ్రాతప్రతుల  అన్ని బూడిదగా మారిపోయాయి  ఆ గ్రంథం బయటకు వస్తే  నాలాంటి వారికి కూడా పాఠ్యపుస్తకంగా పనికి వచ్చేది  అలాంటి అదృష్టాన్ని  పోగొట్టుకున్న మాలాంటి వారందరూ కూడా దురదృష్టవంతులే వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించారు.

కామెంట్‌లు