గురుజాడ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ రోజు అన్ని గ్రామాలలోనూ పట్టణాలలోనూ  ఇతర దేశాలలో కూడా  కన్యాశుల్కం నాటకాన్ని రచించి  దేశానికి అందించిన గురజాడ అప్పారావు గారి జయంతిని  హృదయపూర్వకంగా అంకితభావంతో చేయడం  ఆనందదాయకం  అప్పారావు గారు నాటకం రాయడానికి కారణం  ఏమిటో తెలుసుకోవాలనుకుంటే  నాటకం గురించి తెలియాలి  200 సంవత్సరాలకు పూర్వం నాటకాలన్నీ  సంస్కృతంలోనే వ్రాయబడ్డాయి  ప్రజాభాష కూడా సంస్కృతం కనుక ఆ రోజుల్లో ఆ నాటకాలకు  ప్రాచుర్యం. కాలాను గుణంగా  మారుతున్న కాలంతో పాటు భాష  పద్ధతి కూడా మారడంతో  నాటక రచనలు కూడా  కొత్త పద్ధతులను అవలంబించాలన్న కోర్కె రచయితలకు కలిగింది  అది శుభ సూచకం. 16వ శతాబ్దంలోనే  షేక్స్పియర్  భారతీయ తత్వాన్ని  తన ప్రతి నాటకంలోనూ తెలియజేస్తూ  పాత్రల చిత్రణలో కూడా కొత్త పుంతలు తొక్కినవాడు  పాత్రలను మూడు భాగాలుగా చేసుకొని  గ్రంథస్థమైన ఆంగ్ల భాషను  ఉత్తమ పాత్రలకు  జన భాషను  మధ్యమ పాత్రలకు  సంకర భాష (బట్లర్ ఇంగ్లీష్ ) ను లేదా థర్డ్ గ్రేడ్ ఆర్టిస్టులకు ఉపయోగించాడు  దానితో అతని ప్రతి నాటకం ప్రజల హృదయాలలో నాటుకు పోయింది  ఈనాటికి వారి నాటకాలు  నెలల తరబడి ప్రదర్శిస్తూ ఉండడం మనకు తెలుసు  అలాగే అప్పారావు గారికి  నాటకం ప్రజల కోసమా  ప్రజల కోసం నాటకమా అన్న  ఆలోచనలతో సతమతమై  ప్రజలకు అర్థం కాకపోతే నాటక రచనకు  ప్రయోజనం ఏముంది  అంటూ తన నాటకాన్ని రాయడం ప్రారంభించారు. ఎన్నో రోజులు  ఆలోచించి కథను  ఎన్నుకుని  చిన్న చిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల  తత్వాలను  పొందుపరుస్తూ  ఆనాడు  ప్రచారంలో ఉన్న వైదిక భాషను  ఎన్నుకొని ప్రజా భాషను  మెడికల్ చేసి  పాత్రోచిక సంభాషణలతో  9 గంటల నాటకాన్ని మనకు అందించారు  ఆ రోజుల్లో జమీందారీ వ్యవస్థ ఉండడం  అక్కడ అప్పారావు గారు పనిచేయడం  దానితో జమీందారు గారు  నాటక నిర్వహణకు కానీ  ప్రింట్ చేయడానికి కానీ  వారి సహకారం పూర్తిగా ఉండడంతో  గురవాడ వారి కాలంలోనే ఆ నాటకం బాగా ప్రాచుర్యం చెందింది  160 సంవత్సరాలు దాటినా ఆ నాటకంలో ఉన్న  కథ బలం తగ్గలేదు  బయటికి ఆ నాటకం ప్రజల నోటిలో నానుతూనే ఉన్నది  కనుక ఈ రోజున  వారి జయంతి ఉత్సవాలను  ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు  శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన గురజాడ వారు  అజరామరుడు.


కామెంట్‌లు