ప్రధమ జ్ఞాన పీఠ బహుమతి గ్రహీత- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 సత్యనారాయణ గారు వారి రచనలు ఎప్పుడు వారి స్వహస్తంతో వ్రాసిన పాపాన పోలేదు  ఎప్పుడు ముగ్గురు శిష్యులు  వారి ప్రక్కన వ్రాయడానికి సిద్ధంగా ఉంటారు   ఆయన ఏది చెబుతారో తెలియదు వారికి  కవిత చెప్పవచ్చు  నవల చెప్పవచ్చు  పద్యాలు ఆశువుగా చెప్పవచ్చు  ఆ మూటిని ఎవరెవరు వ్రాయాలో ముందే నిర్ణయించబడి ఉంటుంది  చెప్పడం కూడా చాలా  జ్ఞాపకశక్తితో  కూడి ఉంటుంది  పద్యాలు చెప్పేటప్పుడు  ఈరోజు చెప్పి  తిరిగి రెండవ రోజు చెప్పడానికి ఏరా నిన్న ఎంతవరకు చెప్పాను అని అడిగే అవసరమే ఉండదు వారి మేధ ఎంత గొప్పదో  వారి జ్ఞాపక శక్తి తెలియజేస్తుంది  ఇన్ని ఆలోచనలను చేయడం  దానిని  చెప్పడం  విశ్వనాథ  లాంటి వారికే చెల్లుతుంది.
విశ్వనాథ వారి రాసిన రచనలను  విమర్శించే ధైర్యం ఏ ఒక్కడు చేయడు చేయలేదు  సత్యనారాయణ గారిని ఏరా అని పిలవగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు  నిర్వహించడానికి  వచ్చిన జరుక్ అనబడే జల సూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారు  ఏరా ఏమిరా నీ బొంద  ఇలాగేనా రాయడం  అని చెప్పగలిగిన వ్యక్తి  ఆంధ్ర సంస్కృత పాఠాలనే కాక  ప్రాకృత భాష కూడా నేర్చుకున్న మేధావి
వారు విజయవాడ కేంద్రానికి వచ్చిన తర్వాతనే సూక్తి ముక్తావళి కార్యక్రమాల్లో  బుద్ధుని సూక్తులు పాళీ భాషలో చెప్పి దానిని తెలుగులో వివరించి చెప్పగలిగిన సాహితీవేత్త  అలాంటివారు విశ్వనాథ వారికి సన్నిహితుడు కావడం వారి అదృష్టం. విశ్వనాధ్ వారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో పని చేస్తున్న సమయంలో ఎన్టీ రామారావు గారు  సత్యనారాయణ గారి శిష్యుడు  నాగమ్మ నాటకం చేయడానికి రామారావు గారిని  నాగమ్మ వేషానికి ఎంపిక చేస్తే  ప్రదర్శన రోజున మీసాలు వుంచాడు రామారావు  అలాగే మేకప్ చేసి  మీసాల నాగమ్మ  అన్న పేరుతో ఆ నాటకం ప్రేక్షకుల ముందుకు వెళ్ళింది. అలాంటి సమయస్ఫూర్తి కలిగిన వారు  రామారావు నటించిన ఏ సినిమా 100 రోజులు ఆడినా  దానికి తప్పకుండా విశ్వనాథ గారు  ఆ కార్యక్రమానికి అధ్యక్షులుగా వచ్చి  అధ్యక్ష పీఠాన్ని  అధిష్టించి ఆ కార్యక్రమాన్ని  సక్రమంగా నడిపేవాడు  ఆ సందర్భంగా జెమినీ వారి సినిమా  నాదీ ఆడజన్మే  శత దినోత్సవ సందర్భంగా  సభకు వచ్చారు విశ్వనాథ  వారు  సగౌరవంగా ఆహ్వానించారు రామారావు గారు.
కామెంట్‌లు