మన గన్నవరం...- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేను ఫోర్త్ ఫామ్ హై స్కూల్లో  చదువుతున్న రోజుల్లోనే పోతు కూచి సాంబశివరావు గారు రాసిన దొంగ నాటికను ప్రదర్శించటాన్ని చూసి నన్ను అభినందించింది   గుంటకపుల్లారెడ్డికి వారికి తెలిసిన సుంకర సత్యనారాయణ గారు వ్రాసిన నాటకాలను  ప్రత్యేకించి  విద్యార్థుల కోసం రాసినవి  తీసుకువచ్చి మాకు ఇచ్చి  ప్రదర్శించమని ప్రోత్సహించిన వ్యక్తి  ఆంధ్ర నాటక కళాపరిషత్తును స్థాపించి  పల్లె పడుచు మా భూమి లాంటి అనేక నాటకాలను  ప్రదర్శించడమే కాకుండా  పరిసర ప్రాంతాలలో నాటకోత్సవాలకు వెళ్లి  అక్కడ బహుమతులు తీసుకురావడానికి కూడా కారకులు  పుల్లారెడ్డి గారే మా అన్నయ్యలు పుల్లారెడ్డి రామకృష్ణ  ఆనాటకాలలో ప్రధాన పాత్ర తీసుకున్నారు  మా అన్నయ్య గారి అమ్మాయి  సామ్రాజ్యం మొదటిసారిగా కథా నాయికగా  పాత్రను పోషించి  అందరి మెప్పును పొందింది. మా హెడ్మాస్టర్ ఓ లు సుబ్బారెడ్డి గారిని కలిసి  విద్యార్థులలో  చాలామంది తెలివిగల వాళ్ళు ఉన్నారు  వాళ్లకు సాంస్కృతిక కార్యక్రమాలపై అభిరుచిని పెంచండి  నాలుగు మాటలు ఇక్కడే మాట్లాడడం నేర్చుకుంటే  భవిష్యత్తులో వారు మంచి వక్తలు కావడానికి అవకాశం ఉంటుంది  ఏ విషయాన్ని గురించైనా అనర్గళంగా చెప్పగలిగిన  స్థితి  వారికి రావడం  మనకు మన హైస్కూలుకు  మంచి పేరు కదా  అని వారి అనుమతి తీసుకుని నెలకు ఒకసారి  ఒక్కొక్క అంశాన్ని ఆయన  ఇస్తూ దాని గురించి మా అభిప్రాయాలను  చర్చా వేదికలుగా ప్రసంగాలుగా  అప్పుడప్పుడు అసెంబ్లీ పార్లమెంటు లాగా  మాలోని ఒక నాయకుని ఎన్నుకొని మంత్రులను ఎన్నుకొని  ఆ పరిస్థితులను మాకు అర్థమయ్యేలా చేసింది పుల్లారెడ్డి గారు. ఆడపిల్లలకు కూడా చదువు అవసరం  వారికి అక్షరజ్ఞానం ఉంటే వారి కుటుంబం మొత్తం  ఉన్నత స్థితికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయంతో  మా గ్రామంలో వయసు వచ్చిన పిల్లలను  చదివించడానికి ఎప్పుడూ ప్రోత్సహించడమే కాకుండా  తన కుమార్తెలను ముగ్గురిని  మంచి చదువులే చదివించారు  వారిలో చిన్న పాప  మంచి మార్కులతో  ఎంతో హుషారుగా  కార్యక్రమాలలో పాల్గొనే  విద్యార్థులతో పోటాపోటీగా మాట్లాడి  అనేక పర్యాయాలు బహుమతులు కూడా పొందింది  ఆమెకు పత్రికారంగంపై ఉన్న అభిరుచిని కనిపెట్టి నాన్నగారి వల్ల  ఆ రోజుల్లోనే విశాలాంధ్రపత్రిక  లో చేరి  అనేక వ్యాసాలు వ్రాయడం  ప్రత్యేకించి స్త్రీల కోసం కొన్ని  అంశాలను ఏర్పాటు చేయడం  లో ముందుండేది.


కామెంట్‌లు