భారత్ సేవక్ సమాజ్;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 భారత్ సేవక్ సమాజ్  సంస్థ విస్తృతంగా  సమాజ సేవలు చేస్తున్న సమయంలో  కాకాని వెంకటరత్నం గారు గన్నవరం లో ఉన్న  డ్రిల్ మాస్టర్ ఆంజనేయులు గారిని ఎన్నిక చేసి మాతోపాటు వారిని కూడా తీసుకు వచ్చారు  అనేక చోట్ల  నేను బోసు డాక్టర్ భాస్కరరావు లతో కూడిన బృందం  కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్న రోజులలో  ప్రత్యేకించి ఆంజనేయులు వారు  ప్రతిరోజు ఉదయం సాయంత్రం  పిల్లల కోసం  వ్యాయామం చేయించాలి అన్న అభిప్రాయంతో  డ్రిల్ క్లాస్ ప్రారంభించి  దానిని ఆంజనేయులు గారికి అప్పజెప్పారు  మా అన్నయ్య కోటిరెడ్డి తో పాటు  ట్రైనింగ్ లో పాల్గొని వచ్చినవాడు కనుక నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు నన్ను రెడ్డి అని పిలిచేవాడు.
చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య  పిల్లలను ఉత్సాహపరచడంలో  తాను చెప్పదలుచుకున్న విషయం చక్కగా వారితో చేయించడంలో సిద్ధహస్తుడు  ఆటలు ఆడించడంలో  ఎవరు ప్రముఖంగా ఆడగలుగుతున్నారో వారిని ఎన్నిక చేసి వారు ఏ ఆటలు ఎలా ఆడగలుగుతున్నారో చూస్తూ వారికి తెలిసిన ఆటలను ఆడిస్తూ దానికి మెరుగులు దిద్దే పని  ఆంజనేయులు గారికి తీసుకున్నాడు  ఏమి రెడ్డి డ్రిల్ మాస్టర్ గారి తమ్ముడివి వీళ్ళందరికీ నువ్వు కూడా సహకారిగా ఉండు నేను చెప్పే ప్రతిదీ వారు తప్పు చేస్తూ ఉంటే దాన్ని సరి చేస్తూ ఉండు అంటూ నన్ను తన సహాయకునిగా ఎన్నిక చేసుకున్నాడు  నాతో పాటు ఎంతో హుషారుగా ఉండే ఆజాద్ అంటే కూడా ఆంజనేయులు గారికి ప్రాణం తాను చెప్పదలుచుకున్న ఏ విషయం అయినా ముందు మా ఇద్దరితోనే చెప్పేవారు.
నేను చేసే క్యాంపులో  ప్రతిరోజు మేము ఏది తినాలనుకుంటే  దానినే తెచ్చుకునే ఏర్పాటు చేశారు కాకాణి వారు  ఉదయం లేవగానే ఆ మార్కెటింగ్ చేయడం వండిన పదార్థం వండకుండా  రోజు కొత్త కొత్త వంటకాలతో  పిల్లలకు ఇష్టంగా ఉండేలా చేయించే బాధ్యత  ఆంజనేయులు గారిదే  వారు నన్ను, బోసును తన  సహచరులుగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకునే వాళ్ళం  ఆంజనేయులు గారు గన్నవరం వచ్చిన తర్వాత కూడా ఎన్నో  సామాజిక స్పృహతో కార్యక్రమాలు చేసిన  సందర్భాలు ఉన్నాయి  అలాంటి వాటిలో కూడా  మేము ఆంజనేయులు మాస్టర్ గారికి సహాయ పడుతూ ఉండేవాళ్ళం  అలా మొదట నుంచి  సమాజ సేవ  ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం  దానికి తగిన పరిష్కారాలను చూపడం  అలవాటైపోయింది  దాని కారకులు కాకాని వారైతే  మెరుగులు దిద్దిన వారు ఆంజనేయులు మాస్టర్ గారు.

కామెంట్‌లు