పాఠశాలైన ఆకాశమంతా ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు -9849305871.
ఒక పాఠశాలై ఒక పాఠమై 
బతికింది 
అక్షర తోటలో కరీంనగర్ విద్యా సుమం

బడి వాకిలై
గుండెతడి స్పందనై
నడిచింది చదువుల ఆకాశంలో

అ, ఆ అక్షరాలైన తల్లి చదువు
అక్కున చేర్చుకున్నది 
హుజూరాబాద్,కరీంనగర్,వరంగల్ 
ఎదలు, చదువుల పాదులై ఎదిగే 

అనుభవించిన క్లేశమే
ఉడుము పట్టు తనలో 
విద్య పూలు పూచెను చిరునగవై  

కష్టాలు కన్నీళ్ళ దారి
రాయి రప్పలై నడిచె
బోధనే ఆయువైన రుధిరంలో 

మూడు దశాబ్దాల ఇష్టశ్రమ
నెనరుగా చదివించే 
పాఠశాలైన ఆకాశమంతా అవనిలో 

అక్షరాల చెట్టునీడ పెరిగిన తానే ఆకుపచ్చ చెట్టైంది  
వేళ్ళు దిగిన మట్టి కరీంనగర్ కావ్యమై 

మనసున మనసుగ 
నల్లబల్ల రాసింది సుద్దముక్కై 
చదువు నేర్పితీర్చే క్రమశిక్షణ బంధమై 

అవని ఆకాశమంతా 
అక్షరమై బతికే ఆమె హూందాగా  
ఉదయ సంధ్యల మందారం ఆమె


కామెంట్‌లు