బాల్యం ;- ల్యాదాల గాయత్రి-లక్షెటిపేట్ 9949431849

చిట్టీ చిట్టీ ! ఎక్కడున్నావురా ! నా తల్లి కదూ ! త్వరగా రావాలి..! అంటూ గోముగా పిలుస్తున్న ,తల్లిని మరింత ఆటపట్టిస్తూ పరుగెడుతోంది ఆరేళ్ళ చిట్టి.
"నీకు అన్నం తినిపించడమంటే ఎంత పెద్ద టాస్కో" అని ఒకింత విసుక్కుంది ఆమని.
       "నేనైతే ఎప్పుడూ మా అమ్మని అన్నం తినడానికి ఇబ్బంది పెట్టలేదట .మా అమ్మ చెప్పేది.దీనికి నీ పోలికే వచ్చినట్టుంది."అంటూ వచ్చాడు శ్రీకర్.
    "ఏమోనండీ! ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి తీసికెళ్దామా.ఈమధ్య మరీ చిక్కిపోతోంది" అంది ఆమని భర్త శ్రీకర్ తో బెంగగా.పక్కింటి బామ్మగారు "ఏంటర్రా ..డాక్టరు గారు అంటున్నారు.ఏమైందీ అంటూ "వచ్చింది."ఈమధ్య చిట్టి అసలేమీ తినడం లేదు బామ్మా !"అంది ఆమని.
   కాలం మారింది.పిల్లల పెంపకంలోనూ తేడా వచ్చింది.అతిగారాబం అనర్దదాయకమని ముందు తెలుసుకోవాలి.ఉదయాన్నే నిద్ర లేవడం,తొందరగా నిద్ర పోవడం పెద్దవాళ్ళూ మరిచిపోయారు.ఆదారిలోనే పిల్లలూ.ఆటపాటలూ మర్చిపోయారు.ఆకలెలా అవుతుంది.శారీరకంగా పిల్లలు దృఢంగా ఉంటేనే మానసిక దారుఢ్యాన్ని కలిగి ఉంటారు.
పిల్లలకు మాటలు నేర్చుకునే వయసులోనే చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ వంటి గేయాలు, శతకపద్యాలు , బాల్యంలోనే రామాయణ ,భారత,భాగవత కథలను వినిపించేవారు.పురాణాలంటేనే పిల్లలకు తెలియకుండా పోతున్నాయి."అన్నారు బామ్మ .
         ఆమని ఒక్కసారిగా గతంలోకి జారిపోయింది.రాత్రిభోజనాలు కాగానే ఆరుబయట వెన్నెల్లో హాయిగా ఇంటిల్లిపాదీ చెప్పుకునే కబుర్లలోనే కష్టసుఖాలు,కథలూ ఆప్యాయంగా తొంగిచూసేవి.ఆదమరచి నిద్రబుచ్చేవి.మీరు అన్నం తిన్నారంటే మనం చక్కగా కథలు చెప్పుకోవచ్చు.అనే మాటలతోనే గబగబా కడుపు నింపుకునే వాళ్ళం.అంత అపురూపమైన బాల్యాన్ని ఇప్పుడు మనపిల్లలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనుకుంది బాధగా ఆమని.
  ..
కామెంట్‌లు