ధర్మో రక్షతి రక్షిత,;-ఎం.స్ఫూర్తి,-9వ.తరగతి,-తెలంగాణ ఆదర్శ పాఠశాల,-బచ్చన్నపేట మండలం,-జనగామ జిల్లా

 ధర్మానికి వేదాలు ప్రమాణాలు.ధర్మాధర్మ విచక్షణ వచ్చినప్పుడు సత్పురుషుల ఆలోచించి తగిన నిర్ణయం చేసి ధర్మపక్షపాతులై ధర్మాన్ని ఆచరించిన వారు ఇహలోకాల్లో కీర్తిని,సుఖాన్ని పొందుతారు.మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టం కలిగించకుండా నెరవేర్చుకోవడమే ధర్మం యొక్క ముఖ్య లక్షణం అని చెప్పవచ్చును.భూమి మీద సకల మానవులలోనూ కొందరు ఉత్తములుగా ఉండి తోటి మానవులలో పూజింపబడితే,దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మగుణమే ప్రధాన కారణం.
శాంతి,దయ,
అహింస,సత్యము,ఆస్తేయము,ఉపకారము,సానుభూతి,సౌచము మొదలగు సుగుణములు అన్ని ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.చంపబడిన ధర్మం ఆ ధర్మాని ఆచరిస్తున్న వారిని చంపుతుంది. రక్షింపబడిన ధర్మం ఆ ధర్మాన్ని రక్షించిన వారిని రక్షిస్తుంది.కనుక ధర్మం చేత మనమిప్పుడు చంప పడకుండా ఉండేందుకు మనము ధర్మాన్ని సదా రక్షించాలి.
కామెంట్‌లు